ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 35

 వసువులకి వశిష్టుడు శాపంబిచ్చుట:

జనమేజయునకి వైశంపాయనుడు చెప్పనారంభించాడు.
     ఎటువంటి శత్రు ప్రతాపాన్ని అయిన ఎదిరించగలిగె ప్రతీపుడు అనే ఒక రాజు జన్మించాడు. శత్రువుల ప్రతాపమనే దీపాన్ని చిదిమి వేయగల శక్తి కలిగిన వాడు ప్రతీపుడు. చాల గొప్పవాడు. అత్యంత ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు ఒక సభ ఏర్పాటుచేశాడు. ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే పేరు కలిగిన ఒక గొప్పరాజు ఉన్నాడు. 1000 అశ్వమేధ యాగాలు, అనేక యజ్ఞాలు, దానాలు చేశాడు పండితులని పూజించాడు. ఆ శక్తితో ఊర్ద్వ లోకాలకి వెళ్ళాడు. అయన తపశ్శక్తి వలన బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దగ్గరే ఉండేవాడు. ఒకరోజు సభలో ఒకపక్కన ఇంద్రాది దేవతలు వున్నారు.  మరోప్రక్క మహర్షులు ఉన్నారు. ఆసభలోకి మహాభిషుడు కూడా వెళ్లి అందరితో కలిసి  ప్రార్ధించాడు. శతకమలాసన, సృష్టికారణ, అందరికి శుభ భాగ్యాలు రాసేవాడ, సకల లోక సౌభాగ్యలకి మూలం నువ్వు, అని ప్రార్ధిస్తూ తన్మయత్వంలో ఉన్నారు. ఆసమయానికి అపురూప లావణ్య సౌందర్యవతి, నవనవ కుసుమాల లావణ్యం కలిగిన సుందరి అక్కడికి వచ్చి నిలబడింది. ఆసమయానికి గాలి వీచింది. ఆగాలికి అమెకట్టుకున్న వస్త్రం చెదిరి ఆమె తొడలు కనబడ్డాయి. అక్కడ ఉన్న దేవతలు అందరు ఇది సందర్భోచితం కాదు అని తలలు తిప్పుకున్నారు. శతభిషుడు మాత్రం అలానే ఆ సౌందర్యాన్ని సాభిప్రాయంగా ఘాడంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన బ్రహ్మ ఆగ్రహించి ఇది పరమపవిత్రమైన బ్రహ్మ సభ. ఇక్కడ ఔచిచ్యం మరిచిపోయావ్. గాలికి వస్త్రం చెదిరితే కళ్ళు మూయాలి, తల తిప్పుకోవాలి గాని పవిత్ర వేధస్వరం వచ్చేచోట ఇలాంటి పనిచేస్తావా? మళ్ళి భూలోకంలో మానవుడివై పుట్టు పోఅని శపించాడు. ప్రతీపుడు భయపడి! ఇక్ష్వాక వంశంలో జన్మించి ఎంతో తపస్సుచేసి బ్రహ్మలోకానికి వచ్చి బ్రష్టుడిని అయిపోయానా? ఎంత పొరపాటు చేశాను. శాపం అనుభవించక తప్పదు కనుక మళ్లి తిరిగి బ్రహ్మలోకానికి రావాలంటే ఒక పరమ పవిత్రమైన ఇంట జన్మించి సాధన చేయాలి. భూలోకంలో ఇంతకు ముందు సూర్యవంశంలో ఇక్ష్వాక కులంలో పుట్టాను. ఇప్పుడు చంద్రవంశంలో ప్రదీపుడు అనే మహారాజు ఉన్నాడు. అయన కడుపునా పుడితేనే తపస్సు, యజ్ఞాలు లాంటివి అచరించగలను. సత్సంతానాన్ని పొందగలను. ఈ సత్సంతానాన్ని పొందిన పుణ్యంతో తిరిగి బ్రహ్మలోకానికి రాగలను. కనుకప్రదీపుడికి మాత్రమే కుమారుడిగా పుట్టేలా వరం ఇవ్వు అనగానే సరే తధాస్తు అన్నాడు బ్రహ్మ. అలా ఆ మహాభిషుడు ప్రదీప మహారాజుకి కుమారుడిగా జన్మించడానికి బయలుదేరాడు. అప్పుడు గంగాదేవి! అయ్యో నావల్ల ఈయనికి శాపం వచ్చిందే! మనసులో ! నిజానికి నాకు ఆయనమీద ప్రేమగా ఉన్నది. ఈయన భూలోకంలో పుట్టాక వరిస్తాను అనుకుంటూ భూమికి దిగివస్తుంటే మధ్యలో తలలు వంచుకుని కొందరు ఏడుస్తూ వస్తుంటే గంగ చూసి ఎవరు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు అంటే మేము వసువులం. 
(పై లోకాలలో కేవలం దేవతలే కాకుండా మన భూమిమీదలా అనేక జాతులు ఉన్నాయి. దేవతలు, గంధర్వులు, యక్షులు, వసువులు, కిన్నెరలు, కింపురుషులు, విధ్యాధరులు, ఇలాంటివారు చాలామంది ఉన్నారు. వసువులు మన ప్రాణాలకి అధిష్టాన దేవతలు. అందుకే వసువులని ప్రార్ధిస్తే ప్రాణాలు జిల్లార్చుకుపోవడం ఉండదు. హనుమంతుడు లంకానగరం లోకి ప్రవేశించేటప్పుడు వసువులని ప్రార్ధించాడు. నాప్రాణాలకి ఆయాసం, నీరసం రాకుండా చూడమని. వీరు బంగారపు రంగులో ఉంటారు. యముడికి 10 మంది భార్యలలో వసువు అనే ఆమెకు పుట్టారు కనుక వసువులు అన్నారు.) మేము ఒకనాడు భూలోకంలో విహరార్ధమై విహరిస్తూ ఉండగా వశిష్ట ఆశ్రమం కనపడింది. అక్కడ కామదేనువు కూతురు నందిని దేనువు కనబడింది. అప్పుడు ప్రభాసుది భార్య ఇది ఏమి ఆశ్రమం? ఏ దేనువు ఇది ఇక్కడుంది?అని అడిగింది. ఇది వశిష్టాశ్రమం. ఈ ధేనువు కామధేనువు కూతురు నందిని. అనగానే ప్రభాసుడి భార్య! వుసీనరదేశపు రాజు కుమార్తెకు చిత్రావతి అనే ఒక చెలికత్తె ఉంది. నాకు మంచి స్నేహితురాలు. కొన్నాళ్ళకి వృద్దాప్యంతో చనిపోతుంది. నేను వసు స్త్రీ ని కనుక నాకు చావు ఉండదు. కాని నా మిత్రురాలు మానవ స్త్రీ కూడా నాతో పాటు నా అంత అయువుతో బ్రతికుండాలి అని నా కోరిక. ఈ వశిష్ట ముని ఆశ్రమంలో ఉన్న ఈ నందిని గోవు పాలు తాగితే జరామరణాలు ఉండవట! కనుక ఆ చెలికత్తె కోసం ఈ ఆవుని పట్టుకెళదాం. అప్పుడు చిత్రావతి ఈ గోవు పాలు తాగి జరామరణాలు లేకుండా ఉంటుంది. ఏమంటారు అనగానే ప్రభాసుడు! భార్యామణి అడిగితె కాదంటానా? అని వశిష్టుడు ఆశ్రమంలో లేని ఆ సమయంలో గోవుని తీసుకొని వెళ్ళిపోయారు. కొంతసేపటికి వశిష్టుడు ఆశ్రమానికి వచ్చాడు. గోవుని చుస్తే కనపడలేదు. వెతికితే దొరకలేదు. ఎక్కడ నాతల్లి? ఎక్కడ నాకూతురు. కన్నా బిడ్డలా సాకాను ఆ గోవుని. ఏమైపోయింది? అని నందిని అని పిలవగానే ఎక్కడో ఉన్న ఆ గోవు నన్ను ఎత్తుకుపోయారు అన్నది. (ఈ గోవు! విశ్వామిత్రుడు తన సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు ఒక్క హుంకారంతో తను ఉన్న ఆశ్రమాన్ని చుట్టుముట్టిన విశ్వామిత్రుడు సైన్యాన్ని మట్టుబెట్టిన గొప్ప గోవు.) కాని వశిష్టుడు చెప్పకుండా ఏదీ చేయదు. వసువులు ఎత్తుకెళ్ళేటపుడు ఒక్క హుంకారంతో మట్టుబెట్టేయగలదు. కాని గురువుగారైన తండ్రి లాంటి వశిష్టుడు చెప్పకుండా ఏమి చేయదు. అందుకే ఎంత దూరంలో ఉన్నా పిలవగానే పలికి, నీ అనుజ్ఞ లేదు అందుకే ఊరుకున్నాను. లేదంటే వీరి అంతు చూసేదాన్ని అన్నది. దాంతో వశిష్టుడికి కోపం వచ్చి! మూర్ఖులార ఎవరైనా విప్రుల సొమ్ము అపహరిస్తారా? అందునా నా హోమదేనువుని, కామధేనువుని, నందిని ఎత్తుకుపొతారా? ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు. మనవ లక్షణం కలిగినవారు. మీరు ఇక భూలోకంలో మానవులుగా పుట్టి జరామరణాలతో అలమటించి పోవుదురుగాక! చెప్పు దెబ్బలు, చివాట్లు తింటూ, కష్టాలతో క్రుంగిపొండి. పొండి అని శపించాడు. వెంటనే వసువులు తప్పు తెలుసుకుని వశిష్టుడి కాళ్ళమీద పడి అయ్యా క్షమించండి. చాల తప్పు పని చేశాం. అనగానే జాలిపడి. మహాభిషుడనేవాడు ప్రదీపుడు అనేవాడికి శంతనుడు అనే వాడిగాజన్మించబోతున్నాడు బ్రహ్మ శాపం వల్ల. గంగానది అతనికి భర్య అవుతుంది. ఆ గంగకి శంతనుడికి మీరు పుట్టండి. పుట్టిపుట్టగానే మిమ్మల్ని గంగలో పారేస్తుంది. తక్షణం చినిపోయి మీరు మీలోకాలకి వెళ్ళిపోతారు. కేవలం పుట్టడం వరకే మీరు శాపం అనుభవిస్తారు. ఎక్కువకాలం భూమిమీద ఉండరు. తల్లిగర్భంలో 9నెలలు పెరగడం 10వ మాసంలో చనిపోవడం. కేవలం స్వల్పకాలం మాత్రమే శాపం అనుభవిస్తారు. కాని ఈ ఆఖరి వాడు ప్రభాసుడు తన భార్య మాట విని గోవుని ఎత్తుకుపోయాడు. వీడు మాత్రం 168 సంవత్సరాలు పైగా భూమిపై ఉండి పెళ్లి లేక, సంతానం లేక, ఎంత ధర్మాత్ముడు అయినా, పరాక్రమవంతుడు అయినా అనవసరంగా నిందలు అనుభవిస్తూ బ్రతుకుతాడు. దుఃఖంతో కుమిలిపోతాడు. ఇతడికి సంతానం లేకుండుగాక!పెళ్ళికాకుండా ఉండుగాక! అన్నాడు. అదిగో ఆ వసువులమే మేము.
Next
Previous