మహాభారతం (ఆదిపర్వం)

 పోస్ట్ - 1
జనమేజయుడి యజ్ఞం - ఆదిపర్వం

శౌనకాది మునులు చెప్పమని అడగటంతో ఉగ్రశ్రవుడు! చెప్పడం ప్రారంభించాడు! ఇక్కడ నుంచి ఆదిపర్వం ప్రారంభం అవుతుంది!

జనమేజయ మహారాజు యజ్ఞం చేస్తుండగా ఒక ''దేవ శునకం'' ఆ యజ్ఞ ప్రదేశం చుట్టూ తిరుగుతుంది! అది చుసిన జనమేజయుడి తమ్ముళ్ళు ఆ కుక్కని కొట్టి తరిమేశారు! ఆ కుక్కపిల్ల వెళ్లి తనతల్లి శునకంతో అమ్మ నేను ఆ యజ్ఞాన్ని చూడాలనే ముచ్చటతో నేను అక్కడ సంచరిస్తుంటే ఆ జనమేజయ మహారాజు తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పి ఏడుస్తుంది! అది విన్న తల్లి శునకం తన పిల్లవాడిని తీసుకెళ్ళి అకారణంగా నా పిల్లవాడిని కనీస జ్ఞానంలేని నీ తమ్ముళ్ళు కొట్టారు! ఇలా అమాయకులని, పేదవారిని అకారణంగా భాదిస్తే అనుకోని ప్రమాదాలు వస్తాయి! నీ యజ్ఞం కూడా అలానే అనుకోకుండా ఆగిపోతుంది అని చెప్పి మాయం అయిపొయింది! జనమేజయుడు అది విని ఆశ్చర్యపోయి భాధపడి ఎం ప్రమాదం వస్తుందో అని భయపడుతూ ఉన్నాడు!

యజ్ఞం ప్రారంభం అయ్యేటప్పుడు దక్షణ దిశగా ప్రయాణం చేయొద్దు అని యజ్ఞ ఋత్విక్కులు జనమేజయుడికి తెలియచేశారు! కానీ ఆ దేవశుని శాపం వల్ల అనుకోకుండా దక్షిణ దిశగా వెళ్ళాడు! అక్కడ ఒక అద్భుత సౌందర్యరాశిని చూసి మనసుపడ్డాడు! ఆ సుందరి దగ్గరికి వెళ్లి నిన్ను వరించాను అని చెప్పగానే ఆ సౌందర్య రాశి సరే ఐతే నేను ఏమిచెప్పినా కూడదు అనకుండా చెప్పింది చేస్తాను అంటే నాకు అభ్యంతరం లేదు! సరే అలాగే అని ఆ సుందరిని తీసుకుని యజ్ఞం జరుగుతున్న శాలకి వెళ్లి నిలుచుంటే ఆ సుందరి ''ఈ ఋత్విక్కులు నిన్ను చంపడం కోసం తప్పుడు మంత్ర ప్రయోగం చేస్తున్నారు కాబట్టి వెంటనే వీరిని సంహరించు'' అనగానే వెనకా ముందు ఆలోచించకుండా ఆ ఋత్విక్కులని అక్కడికక్కడే సంహరించాడు! ఆపుడు ఆ సుందరి నవ్వుతూ హ హహ్హహ్హ ఆ దేవశుని శాపం వాళ్ళ నీ యజ్ఞం పాడుచేయడానికి వచ్చాను అని వెళ్ళిపోయింది! జనమేజయుడు తలపట్టుకొని భాదపడ్డాడు!

అది జరిగిన కొంతకాలానికి జనమేజయుడు పెరోలగంలో (సభలో) ఉండగా ఉదంకుడు అనే ముని అక్కడికి వచ్చి జనమేజయుడు ఇచ్చిన అర్ఘ్య పాద్యదులు స్వీకరించి! జనమేజయ అసలు నువ్వేమి చేస్తున్నావ్! బుద్ది ఉందా నీకు! మీతండ్రి అయిన పరిక్షిత్తు ఎలా చనిపోయాడో తెలుసా? అని అనేసరికి జనమేజయుడు నిర్ఘాంతపోయి మొన్నేమో కుక్క శాపం పెట్టింది! ఈరోజేమో ఈ ముని అకారణంగా నిందిస్తున్నాడు! ఇదేం ఖర్మ అనుకుంటూ!

ఆ తెలుసండి! ఒక ముని శాపం వల్ల తక్షకుడు అనే సర్పం కాటేస్తే ఆ అగ్నికీలల్లో ఆహుతి అయిపోయారు! అప్పడు ఉదంకుడు ఓహో అల అనుకుంటున్నావా? ఐతే విను చెప్తాను! ఆ తక్షకుడు మీ నాన్నని అకారణంగా చంపాడు! ఒక మంత్రం వేత్త మంత్రం వేయడానికి వస్తుంటే సంపద ఆశ చూపించి వెనక్కి పంపి వీడు వెళ్లి చంపాడు! నువ్వు ముందు ఆ తక్షకుడిని యజ్ఞం చేసి సంహరించు! లేదంటే శాపిస్తాను! అన్నాడు! దానికి జనమేజయుడు అసలు ఏమి జరిగిందో వివరించి చెప్పండి అని అడిగాడు!

ఈ కథ వింటున్న శౌనకాది మహర్షులకి ఒక సందేహం వచ్చి ఆ కథ అంతా తరువాత వింటాము! అసలు ఆ ఉదంకుడు ఎవరు? ఆ వుదంకుడికి ఆ తక్షకుడికి ఏంటి సంభందం? తక్షకుడి మీద ఎందుకు అంత కోపం పెంచుకున్నాడు? ముందు ఈ ఉదంకుడు సంగతి చెప్పండి అని అడిగారు!

ఉగ్రశ్రవుడు శౌనకాది మునులకి ఉదంకుడు చరిత్ర చెప్పడం ప్రారంబించాడు!
Next
Previous
Click here for Comments

7 comments:

avatar

baga start chesaru, migilina parts kooda konchem tvaraga post cheyyandi ee blog lo

avatar

ముందుగా మీకు ధన్యవాదాలు , మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు లను చాల అద్బుతం గా ఇస్తున్నారు , భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు మరచిపోతున్న ఈ కాలం లో మన తెలుగు లో ఇలాంటి మంచి బ్లాగును ప్రారంబించాలి అన్న మీ ఆలోచన చాలా బావుంది ,
మీరు ఇంతవరకు facebook లో పోస్ట్ చేసినవన్నీ బ్లాగు లో పోస్ట్ చేయండి .

చిన్న సలహా మీ పోస్ట్ లలో పోస్ట్ కు అనుగుణంగా Image లను పొందుపరచండి , ఇంకా బ్లాగు background ఇమేజ్ (మహాబారతం కి సంబందించినది )మార్చండి ,మీబ్లాగు మరింత అందం గా అవుతుందని మనవి .

మీ email ప్రచురించండి , వీలయితే నాకుతోచిన images తయారుచేసి మీకు పంపుతాను . :)

ధన్యవాదాలు ,

http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు
email : techwavetutorials@gmail.com

ఆంధ్ర మహాభారతం సులభంగా అందరికి చేరాలనే మీ మంచి మనసుకు నా వందనాలు. దయచేసి పోస్ట్ చేస్తూ వుండండి. కొంతైనా అందరిలో మార్పు వస్తే (నాతో సహా ) మీరు చేసిన కృషి ఫలించినట్లే.

avatar

మీ ప్రయత్నానికి ధన్యవాదములు. ఈ రోజుల్లో మన పురాణాలు తెలుసుకొనే అవకాశం ఇలా తప్ప మరో మార్గము లేదు. దయ చేసి మీ పోస్ట్లులు అన్న ఒక వరుసక్రమంలో వచ్చేలా చూడగలరు. అక్కడొకటి అక్కడొకటి కన్పిస్తున్నవి. ఒక వరసలో లేవు.

avatar

Very good effort. Requires concentration and sincere hard work. Though there are mistakes here and there, I must congratulate the blogger and his dedication. May God guide and bless. Love and Love alone ...