ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 12

పరిక్షిత్తుని తక్షకుడు కాటేయడం:
బృగు మహర్షి సంతానం అయిన చ్యవనుడు సుతుడైన ప్రమదితో కలిసి చదివాడు. అత్యధ్బుతమైన మతి కలిగిన వాడు కనుక ప్రమది అన్నారు. సకల విద్యలు, సకల శాస్త్రాలు, వేదవేదాంగాలు చదివాడు.. ఏదైనా ఒక్కసారి చుస్తే ఇట్టే పట్టేయగల జ్ఞాపకశక్తి ఉన్నవాడు. ఇంతటి ప్రగృష్టమైన వాడితో కలిసి ఈ ఆస్తికుడు చక్కగా చదువుకున్నాడు. చక్కటి విద్య అభ్యసించాడు. వేదవేదాంగాలు చదివాడు. వేదాంగములు శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుత్తమం ఈ ఆరు అంగములు, యజుస్సమారుగ్వెధాధర్వణ వేదాలు నాలుగు, వేదాలు చదివాడు. ఇవి చదివితేనే జ్ఞానం వస్తుంది.  ఎవరికి ఏ సందేహం వచ్చిన తీర్చగాలిగేంత జ్ఞాని, మంచి పాండిత్యం ఉండేది. ఇన్ని ఉన్నా సాత్వికగుణం ఉండేది. అహం ఉండేది కాదు. ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూసేవాడు. ప్రతి జీవిలో పరమాత్మని చూసేవాడు.

పరిక్షిత్తుని తక్షకుడు కాటేయడం:
శౌనకాది మునులు అడిగన సందేహాలకి సమాధానాలు చెప్పి మళ్లి జనమేజయుడు కథ చెపుతూ ఇదిగో ఈ కధ అంతా ఉదంకుడుకి తెలిదు, జనమేజయుడుకి తెలిదు. మంత్రులకి మాత్రం కొంతమందికి తెలుసు.
ఉదంకుడు రాగానే జనమేజయుడు! నువ్వేమో మీ తండ్రిగారు చనిపోతే తక్షకుడిని చంపకుండా ఎందుకు ఊరుకున్నావు అంటున్నావు. అసలు మానాన్న చనిపోవడానికి తక్షకుడు ఎందుకు కారణం అవుతాడు? శాపం పెట్టినవాడు మూలకారకుడు అవుతాడు కదా అన్నాడు. అప్పుడు మంత్రులు, ఆ విషయం వుదంకుడుకితెలిదు . మేము చెపుతాం అని ఆ కథ చెప్పడం మొదలుపెట్టారు.
పూర్వం ఉత్తరా దేవి అభిమన్యుడు చనిపోయే నాటికి గర్బంతో ఉంది . చాల చిన్న వయస్సులో వైధవ్యం పొందింది. అశ్వద్ధామ ప్రయోగించిన ''బ్రహ్మశిరోనామకాస్త్రం'' (ఇది సౌత్పిక పర్వంలో వస్తుంది. యుద్దం ముగిసిన నాటి రాత్రి అశ్వద్ధామ యుద్ధంలో మిగిలిన పాండవ పక్ష రాజులని, సైన్యాన్ని నిద్రిస్తున్న వారని కూడా చూడకుండా సంహరించి వెళ్లి వ్యాస ఆశ్రమంలో ముని వేషంలో కూర్చున్నాడు. ఇది తెలుసుకుని అక్కడికి వచ్చిన పాండవులని చూసి రాత్రి నేను చేసిన పనికి సంహరిస్తారేమో అని భయపడి ఒక గడ్డి పరకని మంత్రించి అపాండవం అగుగాక! అని ప్రయోగిస్తాడు.) ఉత్తరా గర్భంలో ఉన్న పరీక్షిత్తుని చనిపోయాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు రక్షణ కల్పించాడు ఆ పిల్లవాడికి. తన కుడికాలి బ్రొటన వేలు బొడ్డుమీద వ్రాసి ప్రాణం పోశాడు. పరీక్షీణములు అయిన ప్రాణాలతో పుట్టాడు కనుక పరీక్షిత్ అన్నారు. ఇంకొకటి పిల్లాడు పుట్టగానే అందరిని పరీక్షించి చూశాడు. ఎందుకంటే ఒక అస్త్రం వచ్చి నన్ను దగ్ధం చేస్తుంటే నాలుగు చేతులతో శంఖు చక్ర గద ఖడ్గాలు దరించి నీలమేఘ ఛాయతో ఉన్న ఒక మహానుభావుడు బొడ్డుమీద కాలి వేలితో రాసి బ్రతికించాడు. అయన ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తాడా అని. అలా పుట్టగానే పరీక్షించి చూచాడు కాబట్టి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. ఆ మహారాజు ప్రజలని బాగా పాలించాడు, ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టాడు, కలిపురుషుడిని కూడా అదుపులో పెట్టాడు. ఈయనకి వేట అనే ఒక వ్యసనం ఉంది. సప్త వ్యసనాలలో వెలది, జూదము, పానము, వేట, అని ఉన్నాయి సప్త వ్యసనాలలో వేట కూడా ఒక వ్యసనం. జంతువులని అనవసరంగా చంపడం ఉంటుంది ఇందులో. అసలు వేట ఎందుకు అంటే! పూర్వం అడవులు ఎక్కువ ఉండేవి కనుక క్రూరమృగాలు ఊర్లమీద పడి జనాన్ని పీక్కుతినేవి. రాజు వాటిని చంపి, మిగిలినవి దూరంగా తరిమి వేసి వచ్చేవారు. అది కాలక్రమేణ రాజులకి వ్యసనంగా మారింది. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు ఆ వేట మోజులో పడి రోజంతా వేటలో మునిగితెలాడు. ఆ వేట ఎలా ఉందంటే మృగధర మండలం తక్క అన్య మృగాలని కొట్టాడు. మృగధర మండలం అంటే చంద్ర మండలం) చంద్ర మండలంలో ఉన్న మృగాన్ని తప్ప (చంద్రుడిమీద ఉన్న మచ్చని మృగం తో పోల్చారు) అన్ని మృగాలని వేటాడాడు. అందరు మెచ్చుకునేలా, ఎక్కడో మూలాన దాగి ఉన్న వాటిని, పారిపోతున్న వాటిని కూడా వదలకుండా వేటాడాడు. అలా వేటాడుకుంటూ అడవి మద్యలోకి వెళ్ళిపోయాడు. బాగా దాహంవేసింది. అది కౌశికి నదీతీరం.
Next
Previous