ఆదిపర్వం: మూడవ అశ్వాసం: పోస్ట్ - 21

దేవదానవ అంశలు భూమిపై ఆవిర్భావం:


ఇక దేవ దానవ అంశలతో పుట్టిన వారు గురించి వివరిస్తున్నాను సవధానచిత్తం తో వినమని వైశంపాయనుడు జనమేజయునితో చెప్పాడు.
దేవకివసుదేవులకి విష్ణుమూర్తి కృష్ణుడిగాఆవిర్భవించాడు. విష్ణు అంశలో సర్వజనవంధ్యుడు అయిన ఆదిశేషుడు ప్రలంభాది రాక్షసులని సంహరించడానికి రోహిణి వాసుదేవులకి జన్మించాడు. లక్ష్మి అంశతో రుక్మిణి జన్మించింది.

సనత్కుమారుడు అంశతో ప్రద్యుమ్నుడు, అప్సరసల అంశలతో శ్రీ కృష్ణుని 16000 అంతఃపుర స్త్రీలు జన్మించారు. ఆయా దేవతల అంశలతో యదువృష్టి, భోజ, అంధకు వంశాల వీరులు అనేకులు పుట్టారు. ప్రభాసుడు అనే 8వ వసువు యొక్క అంశతో సప్త విద్యలు ఎరిగినవాడు, పరసురాముడిని జయించేవాడు అయిన భీష్ముడు జన్మించాడు. దేవగురువు బృహస్పతి అంశతో ధనుర్విధ్యాది గురువు, జనవంధ్యుడు, సకల విద్యా గురువు అయిన ద్రోణుడు జన్మించాడు. కామక్రోధాదుల ఏకత్వం వలన శత్రు ప్రళయాన్ని అణచేవాడు, అస్త్ర శాస్త్రాదులలో ఆరితేరినవాడు మహాబలశాలి అశ్వద్దామ ద్రోణుడికి జన్మించాడు. ఏకాదశ రుద్రుల అంశలో గృపుఁడు పుట్టే. సూర్య అంశలో కర్ణుఁడు పుట్టే. ద్వాపరాంశలో శకుని పుట్టే. అరిష్టా పుత్రుఁడు హంసుండనే గంధర్వుడాంశాన ద్రుతరాష్ట్రుండు పుట్టే. మతి యనే వేలు గంధారిగా జన్మించే. వీరికి కలి అంశలో దుర్యోదనుడు పుట్టే. బౌలస్త్య బాత్రు వర్గంబు దుశ్యసనాది దుర్యోజనాదుజ శతంబై(100 మంది) పుట్టే. శిబి చక్రవర్తి ద్రుమశేనుండు, సంహ్లాదుడు శాల్యుడై, హిరణ్యకశిపుడు శిశుపాలుడై పుట్టారు. భష్కరుడు భగదత్తుడై పుట్టాడు. ననుహ్లాధుడు దుష్టకేతుడై పుట్టాడు. విప్రచిత్తి జరసందుడై పుట్టారు. అశ్వపతి క్రుతవర్మై పుట్టే, ఏకచక్రుండు ప్రతివిందుడై పుట్టాడు. విరూపాక్షుడు చిత్రవర్మ యై పుట్టే. హరుండు, నహరుడు సుబాహు, బహ్లికులై పుట్టే. శరభుడు సోమదత్తుడై, చంద్రుండు చంద్రవర్మయై, రాహువు క్రోదుండై, జంద్రహతుడు శుక్రుండై పుట్టారు. క్రధావశ గుణాలవలన మధ్యక, కర్ణ, వేష్ట, సిద్దర్ధ. కీటక, సువీర, సుభాహు, మహావీర, భాహ్లిక, క్రద, విచిత్ర, సురధ, శ్రిమన్నిల, చీరవాసో, భూమిపాల, దంతవక్త్ర, రుక్మి, జనమేజ, మాషాడ, వాయువేగ, భూరితేజ, ఏకలవ్య, సుమిత్ర, వటాధర, గోముఖ, కారూషక, క్షేమధూర్తి, శుతాయు, రుద్వుహ, బృహత్సేన, క్షేమాగ, తీర్ధకుహర, మతిమ, ధుశ్యరాదులనెకులు జన్మించారు. కాలనేమి కంసుడుయై, గుహ్యకుడు శిఖండి యై, మరుద్గున అంశమున పాండురాజు, మరుత్తుల అంశలో ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు, జన్మించారు.
మాండవ్య మహాముని తీవ్రంగా కోపించి ఇచ్చిన శాపం వలన యమధర్మ రాజు సకల ధర్మ వేద పారంగతుడైన విదురుడిగా జన్మించాడు. సిద్ది బుద్ది దేవతలు కుంతీ మాద్రిలు పాండురాజు భార్యలుగా జన్మించారు. యముడు అంశతో ధర్మరాజు , వాయువు అంశతో భీముడు, ఇంద్రుడు అంశతో అర్జునుడు, అశ్వని దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించారు. లక్ష్మి అంశలో ద్రౌపతి, అగ్ని అంశలో దుష్టద్యుమ్నుడు జన్మించారు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.
ఇది దేవాసురుల అంశలో భూతలం మీద జన్మించిన వారి కీర్తనం. దీనిని భక్తితో విన్నవారికి, చదివిన వారికి ఆ దేవాసురులు కోరికలను నెరవేరుస్తారు.

లౌకిక దృష్టితో చదివిన వారికి ఇచ్చేది నీతి, కావ్య దృష్టితో చదివే వారికి కలిగేది రసానుభూతి, ఆధ్యాత్మిక దృష్టితో చదివితే పొందేది సర్వ శ్రేయస్సుల విభూతి.  
Next
Previous