బృగు వంశ చరిత్ర - 2
బృగుపుత్రుడు చ్యవనుడికి, శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య కి వివాహం జరిగింది. వీరికి పుట్టిన ప్రమతికి, అమృతంతో పాటు పుట్టిన ఘ్రుతాచి అనే అప్సరసకు రురువు పుట్టాడు. విశ్వావసుడు అనే గంధర్వుడికి, మేనక అనే అప్సరసకి పుట్టి, స్థూలకేసుడు అనే ముని శ్రేష్టుడు ఆశ్రమంలో పెరిగిన ప్రమద్వరని ప్రేమించిన రురువు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు! ఐతే ఒకనాడు స్నేహితులతో కలిసి ప్రమధ్వర ఆడుతూ ఉంటే ఒక సర్పం కాటువేయడంతో మరణిస్తుంది. ఆ మరణాన్ని తెలుసుకున్న ఋషులు గౌతముడు, కణ్వుడు, కౌశికుడు(విశ్వామిత్రుడు),శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలాఖిల్యుడు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు లాంటి మహామహులైన ఋషీశ్వరులు అంత అక్కడికి వస్తారు. రురువు తన ప్రేయసి చనిపోయిన భాధ తట్టుకోలేక అక్కడినుండి వెళ్ళిపోయి ఎవరైనా ప్రమధ్వరని బ్రతికిస్తే తను చేసిన తపః ఫలం, యజ్ఞఫలం ఇచ్చేస్తాను అని భోరు భోరున ఏడుస్తూ ఉన్నాడు! ఆకాశం నుండి ఒక పురుషుడి స్వరం విధి బలీయమయినది. ఈ రాతని ఎవరు తప్పించలేరు. కాని నువ్వు ఒకపని చేస్తాను అంటే ఉపాయం చెప్తాను అంటాడు! సరే చెప్పమతాడు రురువు. నీ ఆయుష్షు లో సగం ప్రమద్వరకి ఇస్తే తనని మళ్లి బ్రతికించవచ్చు అంటే సంతోషంగా ఇచ్చేస్తున్నాను బ్రతికించు. ఆ మాట అనగానే ఆ పురుషుడు యముడి ఆజ్ఞతో ప్రమధ్వరని బ్రతికించాడు.
ప్రమధ్వర ప్రాణం వచ్చిన వెంటనే ఇంతకుముందు కంటే దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన సౌందర్యంతో ఉంది. ఆ తరువాత ప్రమధ్వరని వివాహం చేసుకున్నాడు.
కాని మనస్సులో తన ప్రేయసిని కాటేసి చంపిన సర్పం మీద క్రోధావేశంతో సర్పజాతిని నాశనం చేయాలని ఒక దుడ్డుకర్ర పట్టుకొని కనపడిన పుట్టని కనపడినట్టు తవ్వి చంపుకుంటూ చెట్టు, పుట్ట ఏది వదలకుండా గాలించి గాలించి కనపడిన పాముల్ని తనచేత నున్న కర్రతో కొట్టి కొట్టి చంపుతున్నాడు. అలా ఒకనాడు చంపుకుంటూ వెళ్తుంటే ''డుండుభం'' ఆనే సర్పం ఆగాగు ఎందుకు పాము జతిమీద ఇంత పగ పట్టావు? సద్బ్రహ్మనుడువి, వేదాంత వేత్తవి, జ్ఞానివి, యజ్ఞాలు చేసి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన నీకు ఈక్రోదం తగునా అనగానే! ఒక్కక్షణం రురువు ఆశ్చర్యపోయి ఏంటి ఈపాము మనవ భాషలో మాట్లాడుతుంది అనుకోని, అయినా ఇదంతా నాకెందుకు అని కొట్టడానికి కర్రపైకి ఎత్తాడు! మళ్లి డుండుభం ఆగాగు నామాట విను అంటే! నేనెందుకు వినాలి? నాభార్యని మీ నాగజాతి వారు కాటేసి చంపారు. కాబట్టి మిమ్మల్ని వదలను. చంపితీరతాను. అనగానే డుండుబం మునిరూపం ధరించి మునిజేశ్వరా మునులకి, పండితులకి కోపం పనికిరాదు. క్రోదం తపస్సుని పాడుచేస్తుంది. ఎన్నో అనర్ధాలకి హేతువు, తప్పుచేసిన వాడిని అయిన క్షమించే గుణం ఉన్నవాడే ఉత్తముడు. అలాంటి ఉత్తముడు అయిన బ్రాహ్మణుడివి నువ్వు! నీ భార్యని ఒక పాము కాటేసి చంపిందని సర్పజాతినే నాశనం చేయాలని నిశ్చయించుకున్నావు. ఇది నీకు తగదు. అనగానే ఇంతకి నీవు ఎవరు ఇంతకుముందు డుండుభం లా ఉన్నావు. ఇప్పడు ముని కుమారుడులా మారిపోయావు. ఎవరు నువ్వు అని అడిగాడు.. సరే అయితే చెప్తాను విను. నేను సర్పాన్ని కాను, నేను ఒక ఋషి కుమారుడిని. ఒక గురుకుల ఆశ్రమంలో చదువుకుంటూ ఉండేవాడిని. నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. అతడికి పాములంటే భయం అని తెలిసి ఏడిపిస్తూ ఉండేవాడిని. ఒకరోజున గడ్డిని పాములాగా చుట్టి వాడిమీద వేసి పాము పాము అని అరిచాను. దానికి వాడెంతో భయపడి గజగజా వణికిపోయి చెమట పట్టి స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. నేను అయ్యొ అనుకుని మొహంమీద నీళ్ళు చల్లి, మిత్రమా అది పాముకాదు. నీకు పాములంటే భయం అని తెలిసి ఆటపట్టించడానికి గడ్డిని చుట్టగా చుట్టి నీ మీద వేశాను. అనగానే, ఎవరికైనా ఒక వస్తువు అంటే భయం అనితెలిస్తే వాడిని ఆ వంకతో పీడించకుడదు, భాధ పెట్టకూడదు. అయిన నాకు పాములంటే భయం అని తెలిసి కూడా నన్ను భయపెట్టావు కనుక నువ్వు పామువు అయిపో. మాములు పామువి కాదు. డుండుభం ఐపో. విషం లేక, నువ్వు పుట్టుకతో శాకహారివి కనుక కప్పలు కనపడినా తినలేక, పాము రూపంలో ఉన్నావు కనుక పాయసం లాంటి ఆహారం తినలేక తిండిలేక గాలి పీల్చుకుంటూ అలమటించిపో అన్నాడు. దాంతో నేను ఏదో హాస్యానికి అలా చేస్తే ఇంత శాపం పెడతావా అనగానే నేనుకూడా ఆవేశంలో శపించేశాను కనుక 1000సంవత్సరాలు ఆహారం లేక అలమటించిపో. ఆతరువాత రురువు అనే వాడు వస్తాడు. అతని కాలి స్పర్శ వల్ల నీ యధారూపం ధరిస్తావు అన్నాడు. ఇప్పటికి 1000సంవత్సరాలు అయ్యింది. ఆ రురువు నువ్వే అని అనిపిస్తుంది. అందుకే నా రూపం నాకు తిరిగి వచ్చింది. మిత్రమా నా కోపం వల్ల పాము రూపంలో శాపం పొందాను. నువ్వు కూడా క్రోధంతో ఉన్నావు. బ్రాహ్మణుడు అయినవాడు ఎవరిని క్రోధంతో సంహరించకూడదు. సమస్త ప్రాణులని సాదువుగా ప్రేమించాలి. చంపాలని మీదకి వచ్చే వాడిని కూడా ప్రేమించే గుణం పరమ పూజ్యుడు అయిన విప్రుడిలో ఉంటుంది. అది అలవరచుకో అని రురువుని విముఖుడిని చేసి పంపాడు. అదిగో ఆ రురువు వంశంలోనే పరమ పూజ్యుడు పుట్టాడు ఆస్తికుడు అనేవాడు.
ఆ ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపడానికి పుడతాడు అనగానే మళ్లి శౌనకాది మునులు ఆ ఆస్తికుడు ఎవరు అని అడిగారు..
0 comments: