ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 9

 గరుడోపాఖ్యానం: 3
తండ్రికి నమస్కరించాడు. తపశ్శక్తి కలిగిన ఇద్దరు అన్నదమ్ములని తినడం వల్ల బాగా శక్తి వచ్చింది. స్వర్గం ఎక్కడుందో తెలుసుకున్నాడు. కశ్యపుడు నాయన! ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్ని గుండం ఏర్పాటుచేశాడు. దాని మధ్యలో అమృత భాండం ఉంటుంది. దానికి  రెండుపక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలా ఉంటాయి. నువ్వొక  పని చెయ్యి. నువ్వు అక్కడికి వెళ్తే అగ్నిహోత్రుడు నిన్ను భస్మం చేస్తాడు కనుక నువ్వు నెయ్యి తీసుకెళ్ళి అందులో వెయ్యి. అగ్ని శాంతిస్తాడు. అప్పుడు సులభంగా అమృతభాండాన్ని తీసుకోవచ్చు అని చెప్పగానే సరేనని నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్లి అంతా చూచి కామదేనువు దగ్గరికి వెళ్లి వెన్న యాచించి తీసుకొచ్చి ఆ అగ్నిగుండంలో వేశాడు. అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్సుమని మీదకి వచ్చాయి. గరుడుడు తన రెక్కలతో ఆ పాముల డిప్పలమీద కొట్టగానే తలలు పగిలి పడిపోయాయి. ఇక ఆ అమృతభండాగారం తీసుకుని వెళ్లిపోతుంటే అక్కడున్న బటులు చూసి ఇంద్రుడుతో గరుత్మంతుడు అమృతం తీసుకేల్లిపోతున్నాడు అని చెప్పారు! ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో వెంటపడి! ఆగవోయి గరుడా అన్నా వినకుండా గరుత్మంతుడు వెళ్లిపోతుంటే వజ్రాయుధం ప్రయోగించాడు. గరుడుడు ఆ వజ్రాయుధం చూసి చిరునవ్వు నవ్వి నువ్వు దదీచి మహర్షి వెన్నుపూసవు. నువ్వునన్ను ఏమిచేయలేవు.  నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. ఇదిగో ఒక ఈక తీసుకుని వెళ్ళు అని ఈక ఇచ్చాడు. వజ్రాయుధం ఆ ఈక తీసుకొని ఇంద్రుడు దగ్గరికి వెళ్ళి ఈ ఈకతప్ప ఏమి పీకలేకపోయాను. అది కూడా ఆయనిచ్చిందే అనిచెప్పింది. అప్పుడు ఆ ఇంద్రుడికి గరుత్మంతుడు బలం అర్ధమై ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు ఐతే మంచిది అని మిత్రమా గరుడా ఈరోజునుంచి నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్కమాట! నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి పాములకి పోశావనుకో వాటికి చావు ఉండదు. విషం పెరుగుతుంది. వాటికి చావులేకపోతే లోకంలో పాములు తప్పమనిషి అన్నవాడు మిగలడు. లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను చెయ్యి. నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి మీ పిన్నికి ఇచ్చి మీరు బంధ విముక్తులు అయిపోండి. ఆ తరువాత శుచి లేకుండా ఈ అమృతాన్ని ముట్టుకోకూడదు స్త్నానం చేసిరమ్మని చెప్పు. వీళ్ళు స్నానం చేయడానికి సముద్రానికి వెళతారు. నేను ఈ కలశం తీసుకోచ్చేస్తాను అప్పుడు నీ మాట నెరవేరుతుంది, నా పని అవుతుంది. వాళ్ళ తిక్క కుదురుతుంది. అనగానే సరేనన్నాడు. 

అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నీ మాతృ భక్తికి మెచ్చుకున్నాను. ఏవరం కావాలో కోరుకోమన్నాడు. ఈరోజునుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. సరే ఐతే! ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. నీకు వాహనం అయ్యే వరం ప్రసాదించు అన్నాడు. సరే నువ్వు మీతల్లిని బంధ విముక్తి రాలిని చేసి నాదగ్గరికి వచ్చేయి. ఈ రోజునుండి గరుడ వాహనుడినై లోకాల్లో సంచరిస్తూ ప్రజా రక్షణం చేస్తాను అన్నాడు. (మాతృభక్తి వల్ల సాక్షాత్తు విష్ణువుకి వాహనం అయ్యాడు.) సరేనని చెప్పి తల్లి దగ్గరికి వచ్చేసి,  అమ్మ కద్రువా ఇదిగో అమృతం!  ఇక నాకు నాతల్లికి బంధవిముక్తి అని పంచభూతాల సాక్షిగాఅని ప్రమాణం చేయించి తల్లిని తీసుకొని వెళ్ళిపోతూ దర్బలమీద పెట్టి అమృతాన్ని అశుచిగా తాగరాదు, అంటరాదు కనుక మీరు సముద్రస్నానం చేసి వచ్చి తాగండి అన్నాడు. సరేనని వీళ్ళు  స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోయాడు. తిరిగివచ్చిన చుస్తే అక్కడ దర్భలు తప్ప ఏమిలేదు అని ఘొల్లున గోలపెట్టారు. అయ్యో దాసీగా ఉన్న వినత, బలవంతుడు అయిన గరుడుడు పోయాడు, అమృతకలశం పోయింది అని భోరుమన్నారు. ఇంతలో పాముల్లో కొందరు అత్రగాళ్ళు అమృతం ఉన్న కుండ ఈ దర్భల మీద పెట్టారు కాబట్టి ఏమైనా చుక్కలు పడి ఉండొచ్చు అనుకోని ధర్భలని నాకడం మొదలు పెట్టారు. ధర్బలని నాకడంతో అప్పటివరకు ఒక్క నాలుకే ఉన్న పాములు ద్విజిహ్వాలుగా(రెండు నాలుకలు) మారిపోయాయి. మాట కూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు.
Next
Previous