ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 10

 గరుడోపాఖ్యానం:  4
ఆ తరువాత!
అమ్మ చేసిన మోసం వల్ల గరుత్మంతుడికి సర్పాలమీద ద్వేషం కలిగింది. ఛీ ఈ బ్రతుకూ ఒక బ్రతుకేనా అని ఆదిశేషుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి కటోర దీక్షతో తపస్సు చేశాడు. బ్రహ్మ మెచ్చుకుని నువ్వు వెయ్యి పడగలమీద భూమిని మొయ్యి. ఆ సమయంలో గరుత్మంతుడుతో నువ్వు స్నేహంగా ఉండు. విష్ణువు నిన్ను పాన్పుగా చేసుకునిపడుకుంటాడు. అయన వాహనం నువ్వు శయ్య. కాబట్టి నీకు గరుడుడు వలన ప్రమాదం ఉండదు, శాశ్వతమైన అనంత తత్వం వస్తుంది అని వరం ఇచ్చాడు. దాంతో విష్ణువుకి శయ్యయై, 1000పడగలపై భుమినిమోస్తున్నాడు. దీనివల్ల తల్లి శాపం అంటదు. వాసుకి తపస్సు చేసి శివుడికి కంటానికి ఆభరణం అయ్యాడు. ఈయనకి కూడా తల్లి శాపం అంటదు. ఇక తక్కిన పాములకి తల్లి శాపంవల్ల చావుతప్పదని తెలిసిన వాసుకి ఆ పాములని పిలిచి మీరు తొందరలో జనమేజయుడు చేసే సర్పయాగం వల్ల భస్మం అయిపోతారు. అవ్వకుండా మిమ్మల్ని కాపాడాలంటే నా వల్ల కావడంలేదు. అన్నయ్య ఆదిశేషుడు విష్ణువుకి పానుపు అయ్యాడు. నేను శివుడి మేడలో ఉంటాను. మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది అనగానే అందులో ఉన్న కొంతమంది! మేము ఒకపని చేస్తాం. జనమేజయుడు చేసే యజ్ఞంలో మేము బ్రాహ్మణుల రూపు ధరించి తప్పుడు మంత్రోచ్చారణ చేస్తాం యజ్ఞం పడిపోతుంది. లేదంటే యజ్ఞంలో వేసే పదార్ధాలు పాడుచేస్తాం. లేదంటే రాముడు - విశ్వామిత్రుడు చేసే యజ్ఞాన్ని నాశనం చేయలనుకోలా!అలాగే మేము నాశనం చేసేస్తాం అనగానే వాసుకి నవ్వి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. జనమేజయుడి యజ్ఞం అంటే అంత తేలికగా కనపడుతుందా? అక్కడ మహామహులైన ఋషులు, వేదవ్యాసుడు లాంటి మహానుభావులు ఉన్నారు. వారికి ఈవిషయం తెలిసిందంటే యజ్ఞంతో పనిలేకుండానే మిమ్మల్ని భూడిద చేసేస్తారు ఏమనుకుంటున్నారో జాగ్రత్త! వారు మంత్రోచ్చారణ చేశారంటే మీరు ఆహార పదార్ధాలు నాశనం చేసేలోపు అగ్నికి ఆహారం అయిపోతారు. మీ కపట చర్యలు వారిముందు నిలబడవు. ఇది కాకుండా ఇంకేదైనా ఆలోచించండి. 
ఇంతలో అక్కడ ఉన్న ఏలా అనే సర్పం కొడుకు ఏలా పుత్రుడు లేచి జనమేజయుడు చేసే యజ్ఞంలో 3వంతుల పాములు మాత్రమే చస్తాయి. కొన్ని పాములు బ్రతికే ఉంటాయి. అదినాకు తెలుసు అన్నాడు. అందరు ఆశ్చర్యపోయి నీకెలా తెలుసు అని అడిగారు. నేను అప్పుడు చిన్న పిల్లాడిని. అమ్మ కద్రువ వడిలో నిద్రపోతుంటే ఆదిశేషుడు - అమ్మ మాట్లాడిన మాటలు వినపడ్డాయి. చెప్తాను వినండి.

ఆదిశేషుడు అయ్యో అమ్మ ఇచ్చిన శాపం వల్ల అందరు చచ్చి పోతారు వీళ్ళని బ్రతికించుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటే! దేవతలందరూ కలిసి బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మతో! కద్రువ కోపంలో అనవసరంగా పిల్లలని శపించింది. మంచి బలవంతులైన పిల్లల్ని కన్నది. కాని జనమేజయుడి యజ్ఞంలో పడి భూడిదైపోతారు. చూస్తూ చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని దేవతలు బ్రహ్మని అడిగారు. అప్పుడు బ్రహ్మ పాములన్నీ అహంకారం,విచ్చలవిడి ప్రవర్తనకి అలవాటుపడి ఎవరిని పడితే వారిని కాటేసి చంపేస్తున్నాయి. అందుకే శాపం ఇచ్చాను. కానీ ఒక విషయం చెప్తున్నాను. యజ్ఞంలో 3వంతుల పాములు మాత్రమే చస్తాయి. తక్షకుడు, ఈ ఏలా పుత్రుడు, కర్కోటకుడు, ఐరావణుడు, ఇలాంటి కొన్ని ముఖ్యమైన సర్పాలు, ఆదిశేషుడు, వాసుకి లాంటి మహానుభావులుకి మాత్రం గండం ఉండదు. జగత్కారువు అనే వాసుకి చెల్లెలికి వివాహం జరిగి పుత్రుడు పుడితే ఆ పుత్రుడివలన యజ్ఞం ఆగిపోతుంది అన్నాడు బ్రహ్మ అని ఆదిశేషుడు అమ్మతో చెపితే నేను విన్నా అనగానే వాసుకి సంతోషించి అన్నయ్యకి చెప్పడంకంటే మనమే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అని జగత్కరువు కి వివాహం చేయడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు.

Next
Previous