పరిక్షిత్తుని తక్షకుడు కాటేయడం: 2
పరిక్షిత్తుకి దాహం వేసి అటుఇటూ తిరుగుతుండగా శమీకుడు అనే గొప్ప తపశ్శాలి ఉన్నాడు. అయన కళ్ళు మూసుకుని పరబ్రహ్మ(అనంతమైన ఆనందం) మీద మనస్సు లగ్నం చేసి పరమాత్ముడు ఎలా ఉంటాడో చూడాలని ద్యాన నిమగ్నుడు (లోకంలో ఏమి జరిగిన తెలియని ఒక అవస్థ) అయ్యాడు. ఆయన దగ్గరికి వచ్చి మహాత్మా నేను సర్వం సహా చక్రవర్తిని, భూమండలాన్ని ఏక చక్రదిపత్యంతో పాలిస్తున్నాను. దాహం వేస్తుంది. కొంచెం మంచి నీరు ఇవ్వు అన్నాడు. కటోర నిష్టతో ద్యాన నిమగ్నుడు అయిన శమీకుడు ఆ మాటలు వినలేదు. మళ్లి మళ్ళి పిలిచినా మాట్లాడకపోయేసరికి దాహం ఎక్కువై ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో అక్కడే చచ్చిపడి ఉన్న పాముని ఆయన మెడలో వేసి వెళ్ళాడు. అలా వెళ్ళగానే పక్కనే కౌశికి నది కనపడింది. (కర్మయోగం ఎవ్వరు తప్పించలేరు అనడానికి ఇదే నిదర్శనం. పక్కనే నది వుంది. కాని కనపడలేదు. పాము శమీకుడి మెడలో వేసి రాగానే కనపడింది. దీని గురించి భాగవతంలో చెప్పారు. పరిక్షిత్తుకి శాపం రాకపోతే బాగవతం పుట్టదు. కాబట్టి దేవతలు ఆ కౌశికి నదిని కొంతసేపు కనపడకుండా చేశారు అని.). అది నిష్కల్మష నది. తేట నీరు ఉంది. ఆ నదిలో దాహం తీర్చుకుని వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి ఇదంతా చూసిన ఆ శమీకుడు శిష్యుడు వెళ్లి సంధ్యా వందనం చేస్తున్న ఆయన కొడుకు, గోప్పతపస్వి, బాగా బలం కలవాడు, అయిన శృంగి దగ్గరికి వెళ్లి ఎవరో వచ్చి మీ తండ్రి గారి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్ళాడు అని చెప్పగానే వీడు ఆగ్రహించి వెంటనే కౌశికి నదిలో ఆచమనం చేసి, చేతిలోకి నీరు తీసుకిని మంత్రించి, నేటి నుండి ఏడవరోజు సంద్యా సమయం ముగియగానే మా తండ్రిగారి మెడలో ఎవడైతే పాముని వేసి అవమానించాడో వాడు తక్షకుడి విషాగ్ని జ్వాలలో పడిదగ్ధమైపోవు గాక ! అని శపించి తండ్రి దగ్గరికి వెళ్లి మెడలో ఉన్న పాముని తీసి నిన్ను అవమానపరచిన వాడిని తక్షకుడి విషాగ్నికి ఆహుతి అయిపోమని శపించాను. అనగానే ఓరి దౌర్భాగ్యుడా ఎంతపని చేశావ్. ఆ వచ్చింది ఎవరనుకున్నావ్. శ్రీకృష్ణుని మనవడు పరీక్షిత్తు మహారాజు. ఏదో దాహం వేసి కోపంలో పాము మేడలో వేశాడని నువ్వు ఆగ్రహించి శపించావు. అసలే అమ్మకడుపులో ఉన్నప్పుడు ఒకసారి చనిపోయి బ్రతికి గండం గడిచింది అనుకుంటే నువ్వు మళ్లి గండం పాలు చేశావ్. సరే జరిగిందేదో జరిగింది. శాపాన్ని వెనక్కి తిప్పుకో అనగానే నాన్న గారు నన్ను క్షమించండి. శాపం ఇవ్వడమే కాని వెనక్కి తిప్పడం తెలిదు. వెంటనే శమీకుడు. ఎంత పనిచేశావ్. కోపం సర్వ అనర్ధాలకి హెతువు. కోపం వల్ల మానవుడు పతనం అవుతాడు. కోపం నరనరాలని కదిలించేస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది . కోపం తపస్సుని నాశనం చేస్తుంది. తపస్సు ద్వార సంపాదించిన శక్తిని హరిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న శక్తిని ఒక్క శాపంతో పోగొట్టుకున్నావ్. అష్ట సిద్దులూ సాదించావ్. కాని నీకోపం వల్ల వాటిని పాడుచేశావు. సర్వ నాశనకారి అయిన కోపాన్ని జ్ఞానులు వదిలిపెడతారు. అలంటి కోపానికి ఎందుకు పూనుకున్నావు. బ్రతికించే శక్తి లేనపుడు చంపే హక్కు ఎవరిచ్చారు. చేతకాని పనికి, చేయలేని పనికి ఎన్నడు పూనుకోరాదు. ఆ మహారాజు ఎంతటి ఉత్తముడు ధర్మాన్ని 4పాదాల నిలబెట్టాడు, ప్రజలందరినీ కన్నా బిడ్డల్లా పాలిస్తున్నాడు. అలంటి మహారాజుని నువ్వు శపించావు. ఓర్పులేని తపస్సు వ్యర్ధం. ఒక్కసారి గాని తపస్వి క్షమని వదిలేస్తే ఇన్నాళ్ళు చేసిన యజ్ఞ, యాగాదులు, తపస్సు అంత వ్యర్ధమే. ప్రమత్తు (జాగ్రత్త లేని, ఏమరపాటుతో ఉన్న,) సంపాద నశించిపోతుంది. చివరికి ఎందుకు పనికిరాకుండా నశించిపోతాడు. ఇంకా ధర్మం లేని రాజు రాజ్యంకూడా నిలబడదు. అధికారం నాదే కదా అని ఇష్టా రీతిన ప్రవర్తించకూడదు. ఇలాంటివి అన్ని ఎటువంటివి అంటే పగిలిన కుండలో నీరు లాంటిది. నువ్వు ఎంత పోసినా కారిపోతుంటాయి. ఆ నీరు లాగే పైన చెప్పిన వారి ఓర్పులేని శక్తులన్నీ నశించిపోతాయి. నీ శక్తి నశించింది. చేయగలిగింది ఏముంది అని పక్కనే ఉన్న శిష్యుడిని పిలిచి విషయం పరీక్షిత్తుకి చెప్పిరమ్మన్నాడు. అలాగే అని వెళ్లి మహారాజ నువ్వేమో శమీకుడు మెడలో పాముని వేసి వచ్చావు. ఆయనకొడుకు శృంగి ఆగ్రహించి నేటికి ఏడవ రోజు సంధ్యా కాలం ముగియగానే తక్షకుడి విషాగ్ని జ్వాలలో పడి దగ్ధం అయిపోమని శపించాడు. అది తెలిసి శమీకుడు శాపాన్ని తిప్పుకోమంటే చేతకాదు అన్నాడు. కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నారు. ఎంతటి పాముని అయిన మంత్రంతో నాశనం చేయవచ్చు. దాని శక్తిని హరించవచ్చు కాబట్టి జరిగినదానికి చింతించకుండా ఉపాయం ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
దానికి పరిక్షిత్తు బాధపడి అసలు నేనెందుకు వేటకి వెళ్లాను, వెళ్తే వెళ్ళాను, పక్కనే ఉన్న నదిలో నీరు తాగకుండా ఆ మునీస్వరుడి దగ్గరికి వెళ్లి పాముని ఎందుకు మేడలో వేశాను. సరే అయన కొడుకు శపించినా సరే నేను శపించను. (పరిక్షిత్తుకి శపించే శక్తి ఉంది). ఇప్పటికే కొంత శక్తి పోయింది. శపిస్తే ఉన్న శక్తి కూడా పోతుంది అనుకుని చేయగలిగింది లేక ప్రపంచం మొత్తం మీద ఉన్న మంత్రవేత్తలని పిలిపించండి అని, తక్షక కొటుల్ని (వడ్రంగం చేసేవారు) పిలిచి మీరు గంగా నది మద్యలో ఒంటి స్థంభం మెడ కట్టండి అని అజ్ఞాపించాడు. అందరు సరే అని ప్రపంచం నలుమూలల నుంచి మహా మహులైన మంత్రవేత్తలు వచ్చి మంత్రాలతో ఆ ఒంటి స్థంభం మేడని దిగ్భంధనం చేశారు. , సుక్షితులు అయిన మంచి బలవంతుల్నికాపలా ఉంచాడు.

0 comments: