శౌనుకాది మునులకి సూతుడు చెపుతున్నాడు..
జనమేజయుడు
యజ్ఞం ఆగిపోయిన తరువాత అశాంతితో ఉండగా అక్కడికి శిష్యులతో సహా విచ్చేసిన
వ్యాసుడితో ఏదైనా కధ చెప్పమని అడగడంతో వ్యాసుడు ఇంకో కధ ఎందుకు మహాభారత కధ
ఉంది. ఈ కథ వింటే చతుర్విధఫల పురుషార్ధములు వస్తాయి. (ధర్మం, అర్ధం, కామం,
మోక్షం. వీటినే చతుర్విధ ఫలపురుషార్ధములు అంటారు) అనగానే ఐతే తాతయ్య మీరే
చెప్పండి అన్నాడు జనమేజయుడు. డు. అప్పుడు వ్యాసుడు నియమం ప్రకారం నేను
చెప్పకూడదు వైశంపాయనుడు చెపుతాడు. అలసిపోకుండా ఎన్ని దినములు అయినా,
నువ్వు అడిగే సందేహాలకి విసుగు రాకుండా చెప్పగల దిట్ట. కొంతమంది చెప్పగలరు.
కొంతమంది చెపుతూ ఉంటే వినగలరు. కొంతమంది వ్రాయగలరు, కొందరు వ్రాసి
చెప్పగలరు. అలాంటి శిష్యులలో వైశంపాయనుడు చక్కగా వ్రాయగలడు, చక్కగా
వినగలడు, చక్కగా సుస్పష్టంగా అర్ధమయ్యే రీతిలో చెప్పగలడు. ఈయన్ని
అప్పగిస్తున్నాను. నేనుకూడా పక్కనే ఉంటాను అన్నాడు. అలా వైశంపాయనుడు
చెప్పగా అయన ఎదురుగా మహాత్ముడు జనమేజయుడు 18దినములపాటు దీక్షగా విన్నాడు.ఈ పద్యం ఒకటి వింటే చాలు చేసిన పాపాలు అన్ని పోతాయి.
కమనీయధర్మార్ధకామమోక్షములకు I నత్యంత సాదనం బయినదాని,
వేడ్కతో దవిలితన్ వినుచున్నవారల I కభిమత శుభకరం బయినదాని,
రాజుల కఖిల భూరాజ్యాభివృద్దిని I త్యాభ్యుదయప్రదం బయినదాని,
వాజ్మనః కామప్రవర్తితానేకజ I న్మ ఘనిబర్వణం బయినదాని,
సత్యవక్పప్రబంద శతసహస్త్రశ్లోక I సంఖ్యమయినదాని, సర్వలోక
పూజ్యమైనదాని, బుధనుతవ్యాస I మహాముని ప్రణీతమయినదాని.
వేడ్కతో దవిలితన్ వినుచున్నవారల I కభిమత శుభకరం బయినదాని,
రాజుల కఖిల భూరాజ్యాభివృద్దిని I త్యాభ్యుదయప్రదం బయినదాని,
వాజ్మనః కామప్రవర్తితానేకజ I న్మ ఘనిబర్వణం బయినదాని,
సత్యవక్పప్రబంద శతసహస్త్రశ్లోక I సంఖ్యమయినదాని, సర్వలోక
పూజ్యమైనదాని, బుధనుతవ్యాస I మహాముని ప్రణీతమయినదాని.
మహారాజా!
భారత గ్రంధాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే! అంత గొప్ప గ్రంధం ఈ భూమండంలో
మరొకటి లేదు గాక లేదు. అంత పవిత్రగ్రంధం. వేదవ్యాస మునీంద్రుడు రాసిన ఈ
గ్రంధాన్ని సాక్షాత్తు అదిశేషుడే పొగిడి పొగిడి అలసిపోయాడు. ఇది పవిత్రమైన
అందమైన ధర్మ, అర్ధ, కామ, మోక్షములు 4 ఇస్తుంది. వేడ్కతో వినేవారికి
భక్తితో, ప్రీతితో, శ్రద్ధతో వినేవారికి వారు (అభిమత శుభాకరంభైన దాని)
ఏదనుకుంటే అది తక్షణం ఇస్తుంది. శుభములని ఇస్తుంది. భారత కదా చెప్పినా,
విన్నా అనుకున్న పనులు అయ్యితీరుతాయి. ప్రభుత్వాధికారం కావాలనుకునే వారికి
అధికారం వస్తుంది. (పూర్వం ఎలక్షన్లలో పోటి చేసేవారు భారతాన్ని వినేవారు.
మహారాజులు రాజ్యాభివృద్ధి కోసం విన్నారు. ఈ భారతం రాజరాజ నరేంద్రుడు తన
రాజ్యాభివృద్ధి కోసమే పట్టుబట్టి నన్నయ్య చేత తెలుగులో వ్రాయించుకుని
విన్నాడు.) ఇది వింటే పదవులు వచ్చి తీరుతాయి. ఇంకా .. వాక్కుతో కాని,
మనస్సుతో కాని, శరీరంతో కాని ఇంకా ఏ రకంగానైన మనం చేసిన పాపములు నాశనం
చేస్తుంది.(ఎదుటి వారిని నిందించడం, ఇతరుల పాపలు ఎత్తుకోవడం, వీడి మీద
వాడికి, వాడిమీద వీడికి లేనిపోనివి కల్పించి చెప్పడం, లేనిపోని అభాండాలు
వేయడం నోటితో చేసేపాపం. ఇక మనస్సుతో చేసే పాపం: ఎదుటివాడిని చూడగానే
వాడిని పడగోట్టేయాలి అనుకోవడం, ఇంటికి వచ్చిన వారితో పైకి మాత్రం మీరు
రావడం మా అదృష్టం అనడం, లోపల మాత్రం వీడి ఆస్తిలాక్కోవాలి, వీడిని నాశనం
చేయాలనుకోవడం, పైకి పవిత్రత, లోపల అపవిత్రత ప్రదర్శించడం, భర్త/భార్య
పక్కన ఉండగానే ఇంకొకరిని మనస్సులో తలవడం ఇలాంటివి మనస్సుతో చేసే పాపాలు.
ఇక శరీరంతో చేసేవి జంతువులని చంపడం, చీటికి మాటికి ఇతరులని కొట్టడం, ఈ
విదంగా ఈ మూడు రకముల పాపాలు భారతం విన్న క్షణమే చక చక నరికి వేసి
తొలగించేస్తుంది.
పూర్తిగా సత్యం
గురించి చెప్పింది. ఇందులో ఉన్న ప్రతివాక్కు సత్యంతో నింపబడినదే. 1,07,
280 శ్లోకాలతో కూడినది. ఇంట్లో చదవడం అర్ధంకాకపోయినా పర్వాలేదు. ప్రతిదినం పూజిస్తే గ్రంధాదిష్టాన దేవతలు సంతోషిస్తారు. (పూజ్యతే యద్గ్రుహం నిత్యం శ్రీ భరతం పుస్తకం ధర్మ మర్థంచ కామంచ మోక్షంచ లభతే నరహ'' అని స్కంద పురాణంలో చెప్పారు.) ఏ ఇంట్లో ఒక గ్రంధం(మహాభారతం) పూజించబడుతుందో ఆ ఇంట్లో ధర్మార్ధకామ మోక్షాలు వచ్చి తీరుతాయి. పండితులు పొగిడారు, దేవతలు పొగిడారు ఈ గ్రంధాన్ని. ఇది నీ పూర్వజన్మ సుకృతం ఇది వినడం. (ఎన్నో జన్మల సుకృతం ఈ గ్రంధం వినడం, చెప్పడం) పాపాలన్నీ పోతాయి, నీ అశాంతత తొలగుతుంది. అన్నిటికంటే గొప్పది మా గురువు గారు గురించి చెప్పడం. మహాపండితులు మెచ్చుకునే కవితావేశం. సాదారణంగా వేదాలు గురుముఖతః వినవలసిందే కాని వ్రాయబడవు. వేదాలు స్వర ప్రధానమైనవి. భారతం అలాకాదు లేక్యమైన ఆమ్నాయం. వ్రాయదగిన వేదం అన్నారు. ఇక భారతం చెప్తున్నాను విను. ఈ భారతం అంతా వ్యాసుని మీద ఆధారపడి వుంది కనుక అయన పుట్టుకతో కథ ప్రారంభిస్తున్నాను అన్నాడు.
జనమేజయుడికి వైశంపాయనుడు భారత కథ చెప్తున్నాడు.
1 comments:
Thank you for posting this. I completed all the posts and am eager to read the next artcle.
thanks a lot.