ఆదిపర్వం: మూడవ అశ్వాసం: పోస్ట్ - 23

కురువంశావిర్భావం : 2

పూర్వం ధక్షుడి కుమార్తె అదితికి, కశ్యపుడికి జన్మించిన వివస్వంతుడనేవాడికి వైవశ్వతుడనే మనువు, యముడు, శని, యమునా, తపతి అనేవారు పుట్టారు. వారిలో వైవస్వంతుడనే మనువు వలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మొదలైన మానవులు పుట్టారు. ఆ వైవస్వతునికి వేనువు మొదలైన 50మంది కుమారులు జన్మించారు. వీరు వంశాన్ని వృద్ది చేసి చివరికి వారిలో వారు కలహించుకొని మరణించారు. ఆ మనువు పుత్రిక ఇల అనే ఆమెకు, చంద్రుడు కొడుకు బుదుడుకి పురూరవుడు జన్మించాడు. పురూరవుడు 13ద్వీపాల భూమండలాన్ని జగద్విఖ్యాతంగా పరిపాలించాడు. గంధర్వలోకంలో ఊర్వశితో కలిసి ఉన్నాడు. వీరికి ఆయువు, ధీమంతుడు, అమావసువు, ద్రుడాయువు, శతాయువు, వనాయువు, అనే ఆరుగురు పుట్టారు.  వీరిలో ఆయువుకి సర్భానవి దంపతులకి  నహుషుడు, వద్ద, శర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే 5గురు జన్మించారు. వీరిలో నహుషుడు రాజయ్యాడు. 4సముద్రాలతో చుట్టబడినది, ద్వీపారణ్యపర్వతాలతో కూడినది అయిన భూమండలాన్ని అపార భాహుబలంతో పాలిస్తూ యజ్ఞయాగాలు చేసి తనకీర్తి నలువైపులా వ్యాపింపజేసి దేవేంద్ర పదవిని పొందాడు. అనహుషుని భార్య ప్రియంవధ. వీరికి యతి, యయాతి, సంయాతి, అయాతి, ఆయతి, ద్రువు అనే ఆరుగురు జన్మించారు. వారిలో యయాతి రాజై శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వివాహం చేసుకుని యదువు, తుర్వసుడు అనే కుమారులని పొందాడు. వృషపర్వ పుత్రి శర్మిష్టతో ద్రుహ్వి, అనువు, పురు అనే ముగ్గురు కుమారులని పొందాడు. శుక్రుడి శాపం వలన యయాతి ముసలితనం పొందాడు. అప్పుడు ఈ 5గురు కుమారులని పిలిచి నాకు ఇంకా కామోపభోగాల మీద ఆశక్తి పోలేదు. కనుక మీలో ఎవ్వరైనా ఈ ముసలితనాన్ని స్వీకరించిన వారికే రాజ్యదికారం దక్కుతుంది అని చెప్పాడు. కాని పురు అనే శర్మిష్ఠ కొడుకు తప్ప అందరు తలలు దించుకున్నారు. అప్పుడు పురు వచ్చి మీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తాను అని ఆ శాపాన్ని తీసుకున్నాడు. అలా పురు వంశంలో కురు అనే అతను పుట్టడం వాళ్ళ కురువంశం అనే నామధేయం ఏర్పడింది. అందులో పాండురాజు పుత్రులని పాండవులు అన్నారు అని జనమేజయుడు వైశంపాయనుడు చెప్పాడు. అప్పుడు జనమేజయుడు అసలు యయాతికి శుక్రుడు శాపం ఎందుకు పెట్టాడు? నాకు ఈ యయాతి సత్చారిత్రం తెలియచేయి అన్నాడు. 

        
Next
Previous