ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 14

పరిక్షిత్తుని తక్షకుడు కాటేయడం: 3
ఆరు దినాలు గడిచిపోయాయి. ఏడవరోజు వచ్చేసింది. ఇదిలా ఉండగా కశ్యప వంశంలో పుట్టిన కాశ్యపుడు అనే మహా మంత్రవేత్తకి విషయం తెలిసి రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. కాలినడకన కీకారణ్యంలో వస్తుండగా ఒక వింతైన వ్యక్తీ కనిపించాడు. ఎర్రటి దేహంతో. పొట్టిగా చూడటానికి జుగుప్స కలిగించేలా ఉన్నాడు. ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వెళ్తూ కాశ్యపుడుని, మిత్రమా ఇంతటి కీకారణ్యంలో ఎక్కడికి ప్రయాణం. అనగానే ఈరోజు తక్షకుడు అనే సర్పం పరీక్షిత్తు మహారాజుని కాటేస్తుందట. నేను మంత్రం వేసి సాపాటు పెడదామని వెళ్తున్నా అనగానే ఆ వింత వ్యక్తి నవ్వుతూ! ఆ తక్షకుడు కాటేస్తే నువ్వు రక్షిస్తావా? అంత శక్తి వుందా నీకు. నేనే ఆ తక్షకుడిని అనగానే కశ్యపుడు, ఐతే మరీ మంచిది. పదా ఇద్దరం వెళ్లి నువ్వు కాటేయ్యి, నేను సాపాటు పెడతాను అనగానే తక్షకుడు అంత దూరం ఎందుకు కాని నీ శక్తి ఇక్కడే పరిక్షించుకో. 25యోజనాల పొడవు, అంతే ఎత్తు కలిగి మొదలు ఎక్కడో తెలియకుండా, దానిమీద కొన్ని లక్షల జీవరాసులు జీవిస్తుంటే, పుట్టే ఆకులు పుడుతున్నాయి, రాలే ఆకులు రాలుతున్నాయి, ఆ రాలిన మీద ముగ్గులు వేస్తున్నట్టు పురుగులు వింత వింత ఆకారాలని ఆ ఆకుల మీద రాస్తున్నాయి(తింటున్నాయి). ఇదిగో ఇప్పుడే కాటేస్తున్నా అని ఉన్నట్టుంది ఆకాశమంత ఎత్తుకి పెరిగిపోయి, పది తలలు కలిగిన మహా సర్పంలా మారి ఒక్క కాటేశాడు. మరు క్షణంలో అది చిట చిట ధ్వనులతో, ఆకాశాన్ని మించి ఇంకా ఎత్తుకి ఎగసిన మంటలతో క్షణాల్లో గుప్పెడు భూడిద అయ్యింది. అదంతా చుసిన కశ్యపుడు
ఓస్ ఇంతే కదా ఐతే చూడు అని తన దగ్గర ఉన్న కమండలంలో నీరు తీసి మంత్రించి ఆ భూడిద కుప్పమీద జల్లాడు. అంతే క్షణ కాలంలో ఇంతకు ముందు ఎలా ఐతే ఉందో అలా యదా స్థానంలోకి మారిపోయింది. తక్షకుడు ఒక్కసారిగా ఆశ్చర్యచికితుడు అయ్యి భయపడి మహాత్మా నువ్వు ఏదో సామాన్య పాములకి మంత్రాలు వేసేవాడివి అనుకున్నాను. ఇంతటి మహా మంత్రవేత్తవి అనుకోలేదు నన్ను క్షమించు. ఐతే ఒక్క మాట ఒక మునీశ్వరుడు ఇచ్చిన శాపాన్ని తప్పించడం ధర్మం కాదు. నువ్వు రాజుని రక్షించేది సంపద కోసమే కదా! అయన ఇచ్చె దానికి పదింతలు ఎక్కువ నేను ఇస్తాను. అవి తీసుకుని వెళ్ళు అనగానే కశ్యపుడు తన తపశ్శక్తితో విషయం గ్రహించి ఓహో ఇది దేవతలు అందరు కలిసి సంకల్పం చేసిన పని. కాబట్టి నేను అడ్డు వెళ్ళడం శ్రేయస్కరం కాదు అని తక్షకుడు ఇచ్చిన సంపద తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు.
మహారాజా ఇదంతా మాకేలా తెలుసు అనుకున్తున్నవేమో! తక్షకుడు చెట్టుని కటేసేటప్పుడు కట్టెలు కొట్టుకునే ఓ వ్యక్తి ఆ చెట్టు మీద ఉన్నాడు. దిగి పారిపోదామనుకునేలోపు ఆ విషాగ్ని జ్వాలలో పడి భూడిద అయిపోయాడు. కశ్యపుడు వేసిన మంత్రానికి మళ్లి బ్రతికి తన గ్రామానికి పరుగు పరుగున వచ్చి అందరికి చెప్తుండగా అది మా చెవిన పడింది. అది మీకు తెలియచేశాము అన్నారు

Next
Previous