కురువంశావిర్భావం : 1
ఎన్నో యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులకి భూరి దక్షిణలు ఇచ్చి, భూమండలాన్ని పాలించిన ఈ కురు వంశం ఎలా ఆవిర్భవించింది అని జనమేజయుడు వైశంపాయుడిని అడిగాడు.
మహారాజ సావధాన మనస్కులై అలకించండి..
పూర్వం దేవతలకి, అసురులకి యుద్ధం జరిగింది! ఆ యుద్ధంలో దేవతలు అసురులని ఎందరినో చంపుతున్నారు! కానీ అసురులు మళ్లి దాడులు చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు జరిగింది! అయితే దేవతలకి అనుమానం కలిగింది! ఇదేంట్రా బాబు మనం సంహరిస్తుంటే మల్లి బ్రతికి వస్తున్నారు! అసలేం జరుగుతుంది అని ఆరా తీస్తే రాక్షసరాజు వృషపర్ణుడు దగ్గర రాక్షస గురువు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యతో బ్రతికిస్తున్నాడని తెలిసింది! అప్పుడు దేవతలు వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకున్నారు. బాగా అలోచించి దీనికి ఒకటే విరుగుడు ఉంది! మీలో ఎవరైనా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సంజీవని విద్య అభ్యసించమని చెప్పాడు. దేవతలు అందరు సమావేశమై ఎవరు వెళ్లి రాక్షస గురువుదగ్గర విద్య నేర్చుకుంటారు అని అనుకుంటుండగా! బృహస్పతి నాకొడుకు సుకుమారుడు కచుడు వెళతాడు అన్నాడు. అందరు అంగీకరించారు. బృహస్పతి కచుడితో నాయనా నువ్వు శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి అబద్దం మాత్రం చెప్పకు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వు బృహస్పతి కొడుకునని కూడా చెప్పు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు గురువు గారికి దేవయాని అనే కూతురు ఉంది. ఆమె అంటే ఆయనకి ప్రాణం. ఏమి చెప్పినా కాదు అనడు. కాబట్టి ఆమెని పట్టుకో! నీపని తేలికగా అవుతుంది అనగానే సరేనని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే దేవుడు కరుణించినట్టు గుమ్మం దగ్గర శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని కుర్చుని ఉంది! ఇతనిని చూడగానే కళ్ళు రెపరెపలాడిస్తూ అందం చూసి మురిసిపోయి సిగ్గుపడి కుడికాలి బొటనవ్రేలు నేలపై రాస్తూ ఉంది! అది గమనించి నేను బృహస్పతి తనయుడిని, గురువుగారి వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చాను అనగానే! సిగ్గుపడి లోపల ఉన్న తండ్రి శుక్రాచార్యుని చూపించింది. గురువుగారిని చూసి వినయంగా నమస్కరించి నేను బృహస్పతి తనయుడిని, మీ వద్ద విద్య అభ్యసించాలనే అభిలాషతో మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఆ మాట విన్న శుక్రాచార్యుడు ఓహో నువ్వు బృహస్పతి కొడుకువా! మీ తండ్రి గారు ఉత్తములు! గొప్పవాడు! ఆపైన దేవతలకి గురువు అలాంటి బృహస్పతి కొడుకు నాదగ్గర విద్య కోసం వచ్చినందుకు సంతోషం నాయానా! తప్పకుండా నేర్పిస్తాను!
(ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే? శత్రువుని అయిన తన దగ్గరికి ఆదరించాలి! విద్య అనేది తన పర భేదం లేకుండా నేర్పించాలి! శత్రువు ఎంతటి వాడైన తన గుణ గణములు పొగడవలసిందే! అలాగే నిజం దాచకుండా ఎక్కడ నుంచి ఎందుకు వచ్చామో అన్ని చెప్పడం వల్ల మనమీద అభిమానం ఇంకా పెరుగుతుంది! అలాగే అవసరం అనుకుంటే ఎవరినైనా (మనకంటే ఎక్కువా కావచ్చు, తక్కువా కావచ్చు) ఆశ్రయించాల్సిందే)
అలా ఒక 1000 సంవత్సరాలు పాటు గురు సుశ్రుష చేసుకుంటూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడు! మరి రాక్షసులు ఊరుకుంటారా? (మనలోనే కొందరు బాగుపడుతున్నారంటే కొందరు చూసి ఓర్వలేక ఎలాగైనా పడుచేయాలని చుస్తున్నారుకదా! వారుకూడా ఈ రాక్షస జాతిలోని వారే).. అప్పట్లో ఒక నియమం ఉండేది! విద్య నేర్చుకోవాలంటే గురువు చెప్పిన పని ఏదైనా సరే చేయాలి ఆరోజుకి విద్య చెప్తారు! గురువు దగ్గరే ఉంటారు శిష్యులు! అన్ని పనులు పూర్తీ చేశాక విద్యాబ్యాసం మొదలు పెడతారు! ఉదయం అవులని మేపడానికి అడవికి వెళ్ళాడు కచుడు! అక్కడ రాక్షసులు వీడిని చూసి అసూయపడి వీడు గురువుగారిదగ్గర మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. ఆ విద్య వీడు నేర్చుకుంటే ప్రమాదం అని కచుడుని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారు! సాయంత్రం అయ్యింది! దమయంతి గుమ్మం దగ్గర కుర్చుని వస్తాడు నారాజు అని ఎదురు చూస్తుంది! ఆవులు వచ్చాయి కచుడు రాలేదు! చాలాసేపు ఎదురుచూసింది చీకటి పడుతుంది కానీ రావడంలేదు! దేవయానికి అనుమానం వచ్చింది. కచుడు అడవికి వెళ్ళాడు. అక్కడ ఏమైనా ప్రమాదం జరిగిందేమో అనుకుని! ఇతడిని క్రూర మృగాలు ఏమి చేయలేవు ఎందుకంటే వాటిని సంహరించగలడు కనుక. పోనీ పాములు ఏమైనా చేస్తాయి అనుకోవడానికి లేదు. బృహస్పతి కొడుకు కనుక. ఇక మిగిలింది రాక్షసులే. కచుడు వచ్చిన దగ్గరనుండి రాక్షసులకి విపరీతమైన ద్వేషంగా ఉంది. వాళ్ళే ఏమైనా చేసుంటారు అనుకుని భోరు భోరుమని ఏడుస్తూ తండ్రి శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి నన్నారు కచుడు ఇంకా రాలేదు అంది! వస్తాడులేమ్మ అన్నాడు శుక్రుడు. కాని దేవయాని! ఆవులు అన్ని వచ్చేశాయి గోధూళి వేళయింది! ఈసమయనికి మీ అగ్నిహోత్రానికి అన్ని సిద్దం చేసేవాడు కదా! సూర్యాస్తమయం అవుతుంది. ఈ రాక్షసులు మీదే నా సందేహం. ఎం జరిగిందో, వీళ్ళు ఏమి చేశారో అని ఏడుస్తుంటే శుక్రుడు చూడలేక కళ్ళు మూసుకొని యోగశక్తితో మొత్తం వెతికాడు! అడవిలో ఒకచోట రాక్షసులు కచుడుని చంపడం, చంపి చెట్టుకి కట్టేయడం అంతా తన మనోనేత్రం తో చూసి ఎంతపని చేశారు అని సంజీవనిని పిలిచి బ్రతికించి తీసుకుని రామన్నాడు! సంజీవని స్త్రీ రూపు దాల్చి కచుణ్ణి చంపి చెట్టుకి కట్టేసిన చోటికి వెళ్లి బ్రతికించి తీసుకొచ్చింది! దమయంతి తండ్రిని కౌగలించుకుని కృతజ్ఞతలు చెప్పి ఇతనిని చూసి సిగ్గుపడుతూ లోపలి వెళ్ళింది! శుక్రాచార్యుడు జాగ్రత్త నాయన వీళ్ళు అసలే రాక్షసులు. మనసు ఉండదు. ఎంత చెప్పినా రాక్షస బుద్ది ఎక్కడికి పోతుంది! బయటకి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండు అని అయన పనిలో అయన మునిగిపోయాడు! ఇలా ఇంకొన్నాళ్ళు గడచిన తరువాత రాక్షసులు అరేయ్ వీడు అసాధ్యుడిలా ఉన్నాడు! గురువుగారిని వదిలిపెట్టడంలేదు! ఎలాగైనా సంజీవని విద్య నేర్చుకోకుండా వెళ్ళేల లేడు! అని బాగా అలోచించి ఒకనాడు కచుడు అవులని తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు రాక్షసులు అంతా కలిసి వీడిని చంపి వదిలేస్తే శుక్రాచార్యుడు మళ్లి బ్రతికిస్తున్నాడు కాబట్టి ఈసారి కాల్చి బూడిద చేద్దాం అని కచుణ్ణి చంపి భూడిద చేసి ఇలాకాదు అని ఈ బూడిద తీసుకొని గురువు గారు తాగే సురాపానం ఉన్న పీపాలో సురలో కలిపేశారు! సాయంత్రం అయ్యింది ఆరోజు శుక్రాచార్యుడు రోజు తాగే సురకంటే ఎక్కువ తాగి ఊగిపోతున్నాడు! రోజు ఒక పీపా తాగితే ఆరోజు 6పీపాలు తాగాడు! దాంతో మైకం ఎక్కువ కమ్మింది! మళ్లి అదే సంఘటన! దమయంతి తండ్రి దగ్గరికి వచ్చింది నన్నారు కచుడు రాలేదు! అని వలవలా ఏడ్చింది! శుక్రాచార్యుడు ఊగిపోతూ వస్తాడులేమ్మా అని తూలిపోతూ మాట్లాడుతున్నాడు! దేవయాని కూడా ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టింది! శుక్రాచార్యుడు తూలిపోతూనే అంతా వెతకడం ప్రారంబించాడు! అడవిలో ఎక్కడ కనపడలేదు! ఎక్కడా కనపడలేదని అన్ని లోకాలు గాలించాడు అయిన కనపడలేదు! శుక్రాచార్యుడుకి క్రమంగా మైకం తగ్గడం మొదలయ్యింది! కచుడు ఎక్కడా కనిపించడం లేదని సందేహం వచ్చి తన ఉదరంలో చూశాడు! ఇంకేముంది బూడిద రూపంలో కడుపులోకి వెళ్ళిపోయాడు! మైకం దెబ్బకి దిగింది! ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాడు! జరిగిందంతా మనోనేత్రంతో చూసాడు! ఈ రాక్షసులు ఎంతపని చేసారుఅనుకుని దేవయానికి విషయం చెప్పాడు! భోరు భోరున ఏడ్చి ఎలాగైనా బ్రతికించమని ప్రాదేయపడింది! కుదరదు అన్న వినలేదు! పట్టుపట్టింది! సరే అని తన ఉదరంలో ఉన్న శిష్యుడిని బ్రతికించాడు. గురువు గారు బ్రతికానండి అన్నాడు. కాని బయటికి రావాలంటే ఎలా అన్నాడు. శుక్రాచార్యుడు బాగా అలోచించి శిష్యుడితో చేసేది లేక నాయనా నీకు ఇలా జరిగి ఉండకపోతే నీకు జీవితంలో ఎప్పటికి మృత సంజీవని విద్య నేర్పించేవాడిని కాదు! కాని తప్పడంలేదు! నువ్వు రాకపోతే మా అమ్మాయి ఊరుకోదు! ఈ విద్య తెలియకుండా నువ్వు బయటికి వచ్చావా నేను చచ్చి పోతాను! కాబట్టి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నన్ను బ్రతికించు అని మృత సంజీవని విద్య నేర్పించాడు! అది నేర్చుకుని శుక్రాచార్యుడు ఉదరం చీల్చి బయటకి వచ్చి గురువు గారిని బ్రతికించాడు!
శుక్రాచార్యుడు శిష్యుడిని మెచ్చుకుని దీనికంతటికి కారణం అయిన ఈ మద్యాన్ని(సుర) ఎవరు సేవిస్తారో (త్రాగుతారో) వాళ్ళకి ఘోరమైన నరకం ప్రాప్తిన్చుగాక! సకల పాతకాలు (బ్రహ్మ హత్య పతకం, బ్రూణ హత్య ఇలాంటి పాతకాలు) ఇలా సకల పాతకాలు చుట్టుకొను గాక అని ఘోరమైన శాపం పెట్టాడు!(ఆనాటి నుండి సుర(మద్యం) తాగినవారు మనో నిగ్రహం కోల్పోయి ఏమి మాట్లాడతారో, ఏమి చేస్తారో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారు! కొందరు తాగిన వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు! ఇవన్ని ఆ శాప ప్రభావమే)
గురువుగారు వచ్చిన పని అయిపొయింది వెళ్లి వస్తాను అన్నాడు కచుడు గురువుగారు అని నమస్కారం పెట్టి బయలుదేరాడు! దేవయానికి కూడా చెప్పాడు. దేవయాని ఒప్పుకోలేదు. నిన్ను బ్రతికించుకున్నది వివాహం చేసుకోవడానికి కాని పంపించడానికి కాదు అన్నది. వెంటనే కచుడు! ఇది ధర్మ విరుద్దం కదా! గురు పుత్రి సోదరితో సమానం, పోనీ అలాకాదు అనుకున్న నేను మీ తండ్రి గర్బం నుంచి మళ్లి జన్మ ఎత్తి వచ్చాను. నీ తండ్రి గర్భం నుండి రావడం వల్ల, నువ్వు నాకంటే ముందు పుట్టడం వల్ల అక్క అవుతావు. లోకంలో ఎవరైనా, ఎక్కడైనా అక్కని వివాహం చేసుకుంటారా? దీనంత అధర్మం ఇంకేమైనా ఉన్నదా? కనుక వివాహం మీద ఆశ వదులుకో అని వెళ్తుంటే దమయంతికి విపరీతమైన కోపం వచ్చి నా మాట తిరస్కరిస్తావా? నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగ పడకుండుగాక అని శాపం పెట్టింది! దానికి ప్రతి శాపంగా నాకు తప్ప నాదగ్గర విద్య నేర్చుకున్న అన్యులకి ఎవరికైన ఉపయోగపడు గాక! అన్యాయంగా నన్ను శపించావు కనుక నువ్వు బ్రాహ్మణున్ని కాకుండా క్షత్రియుడిని వివాహం చేసుకొందువుగాక! అని ప్రతిశాపం ఇచ్చి వెళ్ళిపోయాడు! దేవయాని శాపం, కచుడి ప్రతిశాపం మూలంగా దేవతలందరికీ సంజీవని విద్య వచ్చింది!
(ఎప్పుడైనా ఒక ఉత్తముడిని నాశనం చేయాలనుకుంటే అది నాశనం చేయాలి అనుకున్నవారికే శాపంగా మారుతుంది. ఉత్తములకి వరంలా మారుతుంది. రాక్షసులు కచుడిని చంపి ఉండకపోతే మృత సంజీవని విద్య వచ్చేది కాదు. చెడు చేయడం వల్ల కచుడికి మృతసంజీవని విద్య వరంలా పరిణమించింది. రాక్షసులకి శాపం లా మారింది. అందుకే తొందరపడి ఉత్తముల జోలికి వెళ్ళకూడదు.)

0 comments: