ఆదిపర్వం - మొదటి ఆశ్వాసం; పోస్ట్ - 4

బృగు వంశ చరిత్ర 

అత్యంత శ్రేష్టుడు, ధర్మ నిష్టా గరిష్టుడు అయిన బృగు మహర్షి ఒక రోజున గర్భవతి అయిన తన ధర్మపత్నిని అగ్నిహోత్రుడికి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను హోమం చేయడం కోసం యజ్ఞశాలకి వెళ్ళాడు! అదేసమయంలో పులోముడు అన్న రాక్షసుడు బృగుమహర్షి గృహానికి వచ్చి అగ్నిహోత్రుడితో ఎవరు ఈ సుందరి? ఎవరి భార్య అని అగ్నిని అడిగాడు! ఇంతకుముందే అగ్నితో బృగువు తన ధర్మపత్ని అయిన పులోమ గురించి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పివెళ్ళాడు!
(ధర్మ సూక్ష్మం)
అప్పుడు అగ్ని తనలో తాను నిజం చెప్తే బృగువు శపిస్తాడు! అబద్దం చెప్తే అసత్య దోషంతో బురద కూపం లాంటి నరక లోకంలో పడాలి!
శాపగ్రస్తుడిని అయితే ఎలాగో శాపం తొలగించుకోవచ్చు! కాని అసత్యం చెపితే నరకం తప్పక ప్రాప్తిస్తుంది! లోకాలకే వెలుగుని వేడిని ప్రసాదించి, యజ్ఞ యాగాదులు, నిత్య అగ్ని హోత్రాలు, పాడిపంటలు, ప్రాణులకి, అన్ని లోకాలకి నిత్యం సత్యంతో వెలుగునిచ్చే నేను అబద్దం చెప్పడం వల్ల లోకాలు పాడవుతాయి కాబట్టి సత్యమే చెప్పాలి అని నిర్ణయించి, ఈవిడ బ్రుగుమహర్షి భార్య పులోమ.  అనగానే పులోముడు ఓహో ఈవిడ నాభార్య కావలిసింది ఐతే బృగువు చేసుకున్నాడు. అని నిండు గర్భవతి అయిన పులోమని తెసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా గర్భంలో ఉన్న శిశువు తోడనుండి జారి పడ్డాడు! (కుక్షితుడు కావడంచేత చ్యవనుడు అని పేరు వచ్చింది.)  ఆశిశువుకోటి సూర్యులతో సమానమైన సహింప సఖ్యం కాని దివ్య తేజస్సుతో , ప్రపంచ ప్రళయ సమయంలో సాటిలేని తీక్షణమైన అగ్నితో సమానమైన చూపుతో పులోముడిని భూడిద చేశాడు.

బిడ్డని తీసుకుని ఏడుస్తున్న పులోమని, కళ్ళ ముందు ఉన్న భూడిదని చుసిన బృగువు ఏమి జరిగింది అని అడిగాడు! పులోమ జరిగింది చెప్పగానే బృగువు కోపంతో అగ్నిని సర్వభక్షకుడువి అయిపో అని శపించాడు. దానికి అగ్ని.  ఋషిపుంగవా! నిత్యం అగ్నిహోత్రాలలో, అన్నిలోకాలలో, యజ్ఞాలలో, ఆహావనీయగ్నిగా, దక్షినాగ్నిగా, గార్హపత్యంగా అనేక పుణ్య కార్యాలలో నిత్యం ఆరాదించబడే నన్ను నేను ఈశాపం మూలంగా వ్యర్ధాలని, శవాలని కాల్చి దోషభూయిష్టమై మళ్లి యజ్ఞాలులో ధర్మకర్యాలలో నేను ఉండలేను అని అగ్నిని ఉపసంహరించాడు! (ఇక్కడ నుంచే శవాలని, వ్యర్ధాలని తగలబెట్టడం ఆరంభం అయ్యింది.. దీనికి ముందు కేవలం  ఆహావనీయగ్నిగా, దక్షినాగ్నిగా, గార్హపత్యం అనే 3 అగ్నులుగా మాత్రమే  ఉన్నాడు)

దాంతో నిత్యం ఉపయోగించే అగ్నిహోత్రం, యజ్ఞయాగాదులలో, మిగిలిన ఏ కార్యాలలో అగ్ని వెలగక పోవడంతో ఋషులు, మునులు, గృహస్తులు, సకల జీవరాసులు, లోకాలు అన్ని అల్లకల్లోలం జరిగి సామాన్య ప్రజానీకం మునులదగ్గరికి వెళ్తే , వీళ్ళంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లి అగ్నిహోత్రుడు అగ్నిని ఉపసంహరించుకున్నాడు. దాంతో ఏ కార్యము జరగక లోకాలు తల్లడిల్లిపోతున్నాయి రక్షించు పితామహ అని వేడుకున్నారు! అప్పుడు బ్రహ్మ అగ్నిని పిలిచి నువ్వు ఎలాంటి పని చేసినా, దేన్ని తగలబెట్టిన నీకు రవ్వంత దోషం కూడా అంటదు. అదిన్ని గాక అందరికంటే ముందు నిన్నే ఇకనుండి ముందుగా పూజిస్తారు అని వరం అనుగ్రహించాగానే అగ్నిహోత్రుడు మళ్లి తన కార్యం మొదలుపెట్టాడు.
Next
Previous