ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 11

ఆస్తికుడు చరిత్ర!
ఇంతలో ఒక సంఘటన జరిగింది. జగత్కారువు అనే ఋషి ఉండేవాడు. ఆయన యాయవర వంశంలో పుట్టిన తపోనిధి. పరబ్రహ్మ జ్ఞానంతో (కనిపించిన ప్రతి ప్రాణిలో పరమాత్ముడు ఉన్నాడనే ఊహతో ఎవరిని హింసించక, బాధపెట్టకుండా ఉండటమే పరబ్రహ్మ జ్ఞానం), గురువుల సేవతో ఒకడు బ్రహ్మచర్యం వ్రతం ఆచరిస్తూ, తీర్ధయాత్రలు చేస్తూ, నియమ బద్దమైన ఆహారం తింటూ (ఆహారం ఎక్కడపడితే అక్కడ తినకూడదు. శాకాహారం మాత్రమే తీసుకుంటూ అదికూడా నియమ బద్దంగా ఒక పూటో రెండు పూటలో ఒక సమయం అనుకుని ఆ సమయానికే తింటూ నియమాన్ని పాటించాలి). ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకుంటే లేనిపోని లంపటాలలో చిక్కుకుంటాం. అందువల్ల నశించి పోతాం. మోక్షం ఉండదు. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, మళ్లి వాళ్ళకి పిల్లలు పుట్టడం. వాళ్ళ ముచ్చట్లతో వాళ్ళకోసం రకరకాల సంపాదనలలో పడటం, చివరికి ఎందుకు పనికిరాకుండా శరీరాన్ని విడిచిపెట్టడం, ''పునరపి జనం, పునరపి మరణం'' అన్నట్టు అవుతుంది. ఇలా జనన మరణాల్లో కొట్టుమిట్టాడకుండా మోక్షం పొందాలంటే కటోర నియమంతో తప్పస్సు, తీర్ధయాత్రలు చేయాలని పెళ్లిని విడిచిపెట్టి తీర్ధయాత్రల వంకతో ప్రపంచం మొత్తం తిరగతూ ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ హిమాలయాల దగ్గర ఒక పెద్ద జలపాతం దగ్గరికి వెళ్ళాడు. స్నానం చేద్దామని దిగబోతుంటే ఆ కొండ మీద ఎదురుగా ఒక గడ్డి తుప్పు ఒకే వేరుమీద వేలాడుతుంటే దాన్ని పట్టుకుని కొంతమంది తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు. అది చుసిన ఈ జగత్కారుడు ఆహా ఎం తపస్సు చేస్తున్నారు. ఇంతకుముందు కని విని ఎరుగలేదు ఇలాంటి తపస్సు అని వాళ్ళ దగ్గరికి వెళ్లి మహానుభావులారా! ఇలాంటి తపస్సు నేను ఇంతకుముందు ఎప్పుడు చూసి, విని ఎరుగను. కేవలం ఒకే ఒక్క వేరు మీద వేలాడుతున్న ఆ తుప్ప ని పట్టుకుని ఇంతమంది ఎలా తపస్సు చేస్తున్నారు,. ఆ రహస్యం నాకు చెపితే నేను చేస్తాను అనగానే వాళ్ళు నాయనా ఇది తపస్సు కాదు ఇంకేమి కాదు. మేము పరమ పవిత్రమైన అంగీరస వంశంలోని వారము. మా వంశంలో జగత్కారుడు అని ఒక పనికిమాలినవాడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకోకపోవడం వల్ల మేముచేసిన పుణ్యాలు గతించి స్వర్గం నుండి ఇదిగో ఇక్కడ పడ్డాం. ఈ తుప్పని యముడు పంపించిన భటులు ఎలుకల రూపంలో వచ్చి చివరికంటా కొరికి ఒకే ఒక్క వేరు మాత్రం మిగిల్చాయి. ఈ ఆఖరి వేరు కూడా ఎందుకు మిగిలిందంటే ఆ జగత్కరువు బ్రతికి వుండటం వల్ల. ఇంకో 10, 15 ఏళ్ళలో వాడు వివాహం చేసుకోని మంచి సంతానాన్ని కనకపోతే  ఇది కూడా తెగిం మేము తల్లక్రిందులుగా పాతాళలోకంలోని నరకంలో పడతాం. ఇక మాకు మోక్షం ఉండదు.  జగత్కారుడేమో తీర్ధయాత్రల వంకతో మాని దేశాలు తిరుగుతున్నాడు.  వాడు కానీ  కనిపిస్తే పెళ్లి చేసుకోమని చెప్పు అనగానే. అయ్యా క్షమించండి ఆ జగత్కరుడిని నేనే. నువ్వేనా? మానవుడిని దేవుడు ఎందుకు సృష్టించాడు. చిన్నప్పుడు చదువుకోవాలి, యవ్వనంలో ధర్మమార్గంలో వివాహం చేసుకోని సత్సంతానాన్ని కనాలి. వార్ధక్యంలో ముని వృత్తిలో ఉండి యోగాభ్యాసంతో శరీరాన్ని  వదిలాలి. మానవుడై పుట్టాక ప్రతి వ్యక్తికీ కొన్ని నియమాలు ఉన్నాయి. 16 వర్షములు వచ్చేవరకు చదువుతప్ప ఇంకో వ్యాపకం ఉండరాదు. (ప్రేమ దోమా అని తిరిగితే చివరికి బ్రస్టుడై పోతాడు). యవ్వనంలోకి రాగానే ధర్మబద్దంగా వివాహం చేసుకోవాలి. అది కూడా అపవిత్ర వివాహం కాదు. తల్లి తండ్రుల అనుమతితో కొన్ని నియమాలు పాటించాలి. సత్సంతానం పొందాలి. ఈ సంతానం పొందితే పితృదేవతలు తరిస్తారు. తరువాత వార్ధక్యంలో ముని వృత్తితో అడవులలోకి వెళ్లి తపస్సు చేసుకుని దేహాన్ని త్యజించాలి. కలియుగంలో అడవుల అవసరం లేకుండా ఇంట్లోనే ఉంటూ సంసారం అంటకుండా ఉండాలి. నీటి మీద తామర బొట్టులా! తామర నీటిలోనే పుడుతుంది కాని నీరు దాన్ని అంటదు. అలానే సంసారంలోనే ఉంటూ బంధాలని పట్టించుకోకూడదు. ఎం జరిగిన ఏదో జరుగుతుంది అనుకోవాలి కాని భాద్యత మీద వేసుకోకుడదు. అలా మునివృత్తి స్వీకరించి శరీరాన్ని అనాయాసంగా వదిలేయాలి. అది మానేసి పెళ్లి వదిలేసి నువ్వు ఇలా తిరిగితే మన వంశం నీతో ఆగిపోతుంది. పోనీ నీ అన్నదమ్ములు ఉంటే వారికి సత్సంతనం ఉంటే నువ్వు సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు. పిల్లలు సక్రమంగా ఉంటే తల్లితండ్రులకి ఏమి శ్రమలేకుండా మోక్షం వస్తుంది.,పిల్లలు సరైన వాళ్ళైతే, పిల్లలని సరైన విదానంలో పెట్టడానికి తండ్రి కృషి చేస్తే దేవతలు, ఋషులు ప్రసంసిస్తారు! అప్పుడు వీరికి అంతవరకు చేసిన పాపఖర్మలు నశిస్తాయి. దాంతో మోక్షం ప్రాప్తిస్తుంది.శాశ్వత కైవల్యం పొందుతారు. ఈ పుణ్యాలు, యాగాలు చేసినా, దానాలు చేసినా, సౌచ క్రియలు చేసినా, తీర్ధయాత్రా శీలురైనా లభించదు. ఇదంతా కూడా సత్సంతనం వల్లే తప్ప దేనివల్లా రాదు. నువ్వు సంతానం పొందక యాత్రలు చేయడం వల్ల ఏమి ఉపయోగం లేదు. నువ్వు చేసిన అపచారం వల్ల మా పుణ్యలోకాలు పోయాయి! నువ్వు ఒక్కడివి కాబట్టి నువ్వు వివాహం చేసుకో అనగానే జగత్కారువు మనస్సేమో అంగీకరించడంలేదు. మీరేమో శాపిస్తున్నారు. సరే ఆలోచిస్తున్నా అన్నాడు. నువ్వు ఆలోచించడం కాదు. వివాహం చేసుకోపోతే మేము పాతాళంలో పడిపోతాం . ఆ తరువాత నువ్వేమి చేయలేవు అన్నారు.
సరే ఐతే నా పేరు ఉన్న అమ్మాయి దొరికితే చేసుకుంటా అన్నాడు. అటుగా వెళుతూ అది విన్న వాసుకి ఇదే పేరుతొ నా చెల్లెలు ఉంది వివాహం చేసుకో అన్నాడు. జగత్కారుడు వివాహం తప్పించుకోవాలి అని ఆ మాట అంటే చటుక్కున వచ్చేశాడే అని చేసేది ఏమి లేక సరే ఐతే నాదొక నియమం. దానికి అంగీకరిస్తేనే మీ చెల్లెలితో వివాహం. ఒకసారి మీ సోదరిని ఇటు పిలువు అనగానే అక్కడికి వచ్చిన జగత్కారువుతో నేను ఎం చేసిన, ఎం చెప్పినా కాదనకూడదు దీనికి నువ్వు అంగీకరిస్తే నిన్ను వివాహం చేసుకుంటాను సరేనా? జగత్కారువు సరే అంది. వివాహం జరిగి కొన్నాళ్ళు గడిచింది. కొన్నాళ్ళకి జగత్కరువు గర్భవతి అయ్యింది. భర్త ఏమి చెప్పినా, ఏమన్నా మరు మాట్లాడకుండా చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. భర్త అయిన జగత్కరుడు ఎలాగైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని సంధ్యా సమయంలో! భార్యతో ఇదిగో నేను బాగా అలసిపోయాను. నిద్రిస్తున్నాను నన్ను లేపకు అని దొంగ నిద్రకి ఉపక్రమించాడు. అందునా సంధ్యా సమయం, సంధ్య వందనం చేయాలి, చీకటి పడిపోతుంది అని భర్తని లేపాలి అనుకుంది. కాని వాక్కు తప్పితే విడిపోతనన్నాడు. లేపకపోతే ఈయనకి పాపం. లేపితే నాకు శాపం. సరే నేను ఏమైపోయినా పర్వాలేదు. ఆయనకి ఏమి కాకూడదు అని లేపింది. అప్పుడు భర్త! లేపోద్దన్నానా!  మాట తప్పావు కనుక నీకు నాకు చెల్లు అన్నాడు.  అదేంటి లేపకపోతే మీకు ప్రమాదమని లేపితే ఇలా చెల్లుననడం న్యాయమా అనగానే ఏది ఏమైనా మాట తప్పావు కనుక ఈరోజు నుండి నీకు నాకు చెల్లిపోయింది అని వెళ్లిపోతుంటే! మరి నా పరిస్థితి ఏంటి అని అడిగింది! అప్పుడు జగత్కారుడు పిచ్చిదానా ఇక్కడ ఎవరికి ఎవరు బంధం? ఎక్కడినుంచో ఇక్కడికి వస్తాము! ఒకరు స్త్రీ రూపం, ఇంకొకరు పురుష దాలుస్తాము. ఒకరికి ఒకరు అ ని భార్య భర్తలం అవుతాం, ఈ సర్వమూ హరిమయం. ఎక్కడా ఎవ్వరికి ఏ సంభందం లేదు. శరీరం ఉన్నంత వరకే ఈ బంధం. నేను వెళ్ళిపోతున్నాను అంటే శరీరం వదిలేశాననుకో. నీకు నీవే మోక్షం పొందాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. దానికి మార్గం చెపుతాను కానీ దాన్ని ఆచచరించే శక్తి మీకే ఉండాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. జగత్కారువు కూడా నిర్వికారంగా ఇది పరమేశ్వరుని సంకల్పం అని దిగులు పెట్టుకోకుండా కొన్నాళ్ళకి మంచి సుపుత్రుడు పుట్టాడు. ఏమి చెప్పి పెంచిందో తెలియదు కాని అస్తి అస్తి(మంచి జరుగుతుంది జరుగుతుంది) అని తప్ప ఇంకోమాటగా వ్యతిరేకం వాడేవాడు కాదు.(దేవుడు మానవుడికి కొన్ని శక్తులు ఇచ్చాడు. వ్యతిరేకంగా ఆలోచించకుండా, మాట్లాడకుండా ఇది అయ్యితీరుతుంది అని సంకల్పం చేస్తే కచ్చితంగా అవుతుంది. కాని ఏ సమయంలోను వ్యతిరేకంగా అలోచించకుడదు. ప్రత్యేకించి మనకి శక్తులు అవసరం లేదు. పవిత్రత ఉండి సంకల్పం ఉండాలి. ఈ కలియుగంలో భూమిమీద విష్ణువే పుట్టినా మంత్ర శక్తులు పనిచేయవన్నారు. ఎవరి మీదా ద్వేషం కానీ, ప్రేమ కాని, మంచి కాని చెడు కాని, తప్పుడు తలపులు కాని, చెయ్యడం కాని, చేయకపోవడం కాని సంకల్పం నుంచి పుడతాయి. ఆ సంకల్పం వ్యతిరేకం రాకుండా వుండాలి. అప్పుడు ఎవ్వరు అడ్డుకున్నా ఆగదు.). అస్తి అస్తి అనడం వలన అతనికి ఆస్తికుడు అనే పేరు వచ్చింది....
Next
Previous