మత్స్యగ్రంధి పరాశరుని వరం వల్ల యోజన గంధి గా మరింది. ఈమే ఎక్కడ ఉన్నా 10 యోజనాల దూరం సువాసన వచ్చేది. ఇంతకుముంది చేపకడుపున పుట్టడం వల్ల చేపల వాసన వచ్చేది.
లోకపూజ్యుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు మేదోగర్భంలో పుట్టడం వలన వెంటనే తల్లి అయిన సత్యవతికి నమస్కరించి నేను నీదగ్గర ఉండటం ఉత్తమం కాదు కనుక నేను లోకశ్రేయస్సుకోసం ఘోరతపస్సు చేయాలని నిశ్చయించి వెళుతున్నాను. నువ్వు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు నీ అభీష్టం నేరవేర్చుతానని సెలవుతీసుకొని ఘోర తపస్సు చేశాడు;
పుణ్యనిధియున్నూ, బ్రహ్మ అంశాన జన్మించిన వాడున్నూ అయిన కృష్ణ ద్వైపాయనుడు వేదాలు విభాగించి, లోకంలో ప్రాశస్తం కావించి, విశ్వశ్రేయస్సుకై పంచమవేదమని ప్రసిద్ది కావించిన ఈ భారత సంహితను రచించాడు.
సకల జీవుల ఆవిర్భావం:
విష్ణువు పరశురామ అవతారంలో 21సార్లు క్షత్రియ సంహారం చేసిన తరువాత మిగిలిన కొందరు కొన్ని ద్వీపాల్లోకి పారిపోయారు. కాని భూమండలం అంతా వెతికి వెతికి గాలించి చంపేశాడు. రాజ్యాల్లో ఉన్న మిగిలిన ఆడవారు ఋతు కాలంలో బ్రాహ్మణుల వల్ల సంతానం పొందారు. వారు సుక్షత్రియులు గా భూమండలం మొత్తాన్ని పరిపాలించారు. యజ్ఞాలు, యాగాలతో ఇంద్రుడిని మెప్పించారు. అయన సంతోషించి సమయానికి వర్షాలు కురిపించి సస్యస్యామలంగా దాన్యభివృద్ది కలిగేలా చేశాడు. యజ్ఞాలవల్ల ఆయుష్షు పెరిగింది, పంటలు విరివిగా పండి దేశం సస్యస్యామలం అవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయారు. జరాసంధుడు, శిశుపాలుడు లాంటి మహాబలవీర పరాక్రమం గల పాపాత్ములు పుట్టలు పెరిగినట్టు పెరిగిపొయారు. దేవతలు, రాక్షసులు, మునులు, యక్షులు, పక్షులు, గంధర్వులు అంశలో మహావీరులు భారత యుద్ధం చేయడానికి అనేకులు పుట్టారు. వారి బలాబలాలు తెలిసి చెప్పడానికి 1000 పైన ముఖాలు కలిగిన వారికీ కూడా చెప్పడం సాధ్యం కాదు. వీరిలో దైవం అంశాలో పుట్టినవారు పాండవులవైపు, రాక్షస అంశలో పుట్టినవారు కౌరవులతో కలిసి భారత సంగ్రామం లో చనిపోయారు అనగానే జనమేజయుడు, అసలు దేవదానవుల అంశలో పుట్టిన సకలరాజ సమూహాలు నశించడానికి కారణం ఏమిటి? అసలు సృష్టి ఎలా ఆవిర్భవించింది. అని వైశంపాయుడిని అడిగాడు.
వైశంపాయనుడు సృష్టి ఆవిర్భావం యధాతధంగా చెప్పనారంభించాడు.
పూర్వం బ్రహ్మ మానస పుత్రులు అయిన మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు 6గురు ఋషులు ఆవిర్భవించారు! మరీచికి కశ్యపుడు, స్థావర జంగామాలు జన్మించారు. బ్రహ్మ కుడి బ్రొటన వేలి నుండి దక్షుడు, ఎడమ బ్రోతనవేలి నుండి ధరణి అనే స్త్రీ ఆవిర్భవించారు. ధరణికి 1000 మంది ఇంద్రియనిగ్రహం గల ఋషులు జన్మించారు. దక్ష ప్రజాపతికి 80 మంది కుమార్తెలు జన్మించారు. ధర్ముడు కి 10మందిని, చంద్రుడికి 27మందిని, కశ్యపుడుకి 13 మందిని ఇచ్చి వివాహం చేశాడు. ఇందులో కశ్యపుడు కి అధితి అనే భార్య వలన ద్వాదశాదిత్యులు, దితికి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కి ప్రహ్లాదుడుతో కలిపి నలుగురు పుత్రులు జన్మించారు. ప్రహ్లాదుడుకి విరోచనుడు, కుంభవుడు, వికుంభవుడు జన్మించారు. వీరిలో విరోచనుడుకి బలి. బలికి బాణాసురుడు జన్మించారు. దునుకి విప్రచిత్తుతో కలిపి 40మంది దానవులు ఆవిర్భవించారు. వీరి సంతానం అయిన కొడుకులు, మనువలు, మనవరాళ్ళు లెక్కింప సఖ్యం కాదు. కాలకి వినాశనుడుమ క్రోధుడు తో కలిపి 8మంది సంతానం కలిగారు. అనాయువుకి విక్షర, బల, వీర, వృత్తు అనే నలుగురు ఇంద్రుడుకి శత్రువులై పుట్టారు, సింహకు రాహువు, ముని కి భీమసేనాదులైన 16మంది గంధర్వులు, కపిలకు అమృతం, గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు, వినతకి అనూరుడు, గరుడుడు జన్మించారు. అనూరుడు భార్య శ్వేని వలన సంపాతి, జటాయువు జన్మించారు. క్రోదకి క్రోధవశ గణం జన్మించారు. ప్రాధకు సిద్దార్ధులు, క్రూరుకు సుచంద్రాదులు, కద్రువకు శేషుడు, వాసుకి లాంటి సర్ప జాతులు జన్మించాయి.
అంగిరసుడు అనే మరో మానస పుత్రుడుకి ఉధధ్యుడు, బృహస్పతి(దేవతల గురువు అయ్యాడు), సంవర్తుడు అనే కొడుకులు, గుణవతి అయిన యోగసిద్ది అనే కుమార్తె కలిగారు. అత్రి అనే మానస పుత్రుడు కి వేదవిధులు, ఆధ్యులు, సత్యపరులు అయిన పరమ ముని శ్రేష్ఠులు పుట్టారు. పులస్త్యుడుకి రాక్షసులు, పులాహుడుకి కిన్నెర కింపురుషాదులు, క్రతు కి పక్షి సంతతులు, దేవు అనే మనువుకి ప్రజాపతి జన్మించారు. ప్రజాపతికి 7గురు భర్యలు. వీరిలో ద్రూమకి ధరుడు, బ్రహ్మవిద్యకు ధ్రువుడు, మనస్వినికి సోముడు, రతకి అహుడు, శ్వాసకు అనిలుడు, శాండిలికి అగ్ని, ప్రభాతకి ప్రత్యూష,ప్రభాసు అనే వసువులు జన్మించారు. వారిలో ధరుడు కి ద్రవిణుడు, హుతహవ్యవహుడు, ద్రువుడుకి కాలుడు, సోముడుకి వర్ససుడు,శిబిరుడు, ప్రాణుడు, రమణుడు, మరియు ప్రద అనే కూతురు జన్మించారు. పృదకి 10మంది గంధర్వులు, మహుడికి జ్యోతి, అనిలుడు భార్య శివ వలన మనోజవుడు, అవిజ్ఞాతగతి, అగ్నికి కుమారు, ప్రత్యూషుడుకి దేవలుడనే ఋషి, ప్రభాసుడుకి బృహస్పతి సోదరి అయిన యోగసిద్ది వలన విశ్వకర్మ జన్మించారు. విశ్వకర్మ దేవతలకి విమానాలు, సమస్త దివ్యాభరణ సంపద విరచించాడు. శిల్పప్రజాపతి అయ్యాడు. స్థాణుడు కి మానసపుత్రులు అయిన ఏకాదశ రుద్రులు ఆవిర్భవించారు.
బ్రహ్మ దక్షిణ హస్తం నుండి ధర్ముడు అనే మనువు ఆవిర్భవించాడు. ధర్ముడుకి శామకా మహర్షులు అనే ముగ్గురు జన్మించారు. ఈ ముగ్గురికి ప్రాప్తి, రతి, నంద భార్యలు. సవిత్రుడుకి బడరూపం ధరించిన త్వాష్టికి అశ్వినులు జన్మించారు. బ్రహ్మ హృదయం నుండి బ్రుగువు, బృగువుకి కవి, కవికి శుక్రుడు. ఈయన రాక్షస గురువు అయ్యాడు . ఆ శుక్రుడుకి 4కొడుకులు పుట్టారు. వీరు రాక్షస యాజ్ఞాకులైనారు!
బ్రుగువుకి ఇంకో కొడుకు చ్యవనుడు, చ్యవనుడు భార్య మనుకన్య భార్య వలన ఔర్యుడు కలిగాడు. ఔర్యుడు కి ఋచికాదు లనబడే 100మంది ఋషులు జన్మించారు. వీరిలో జమదగ్నికి 4కుమారులు. వీరిలో పరుశురాముడు విష్ణు అవతారం. బ్రహ్మకి దాత, విధాత జన్మించి మనువుకి సహయులయ్యారు. దాత, విధాత లతో పాటు లక్ష్మి పుట్టింది. లక్ష్మికి మనసపుత్రులు అనేకులు జన్మించారు. జేష్ఠ వరుణులకి బలుడు, సురా అనే కూతురు కలిగారు. సురకి అధర్ముడు, అధర్ముడు కి నిర్రుతి భార్య. వీరికి భయా, మహాభయుడు, మృత్యువు పుట్టారు. మరియున్నూ తామ్రకు కాకి, శ్వేని, దృతరాష్ట్రి, సుకి అనే కన్యలు పుట్టారు. కాకికి గుడ్లగూబలు, శ్వేనికి డేగలు, భాసికి భాసములు, గ్రద్దలు,, ద్రుతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు, శుకికి చిలకలు, క్రోదుడికి మృగితో కలిపి 9మంది కూతురులు కలిగారు. వీరిలో మృగికి మృగాలు, మృగమంద అనే ఆమెకు ఎలుగుబంట్లు, చిన్నా, పెద్దా చమరీ మృగాలు, హరి అనే ఆమెకు కోతులు, భద్ర మనసకు ఐరావరణం. ఐరావణానికి దేవగణాలు, మాతంగికి గజాలు, శార్దూలికి సింహాలు, పెద్ద పులులు, శ్వేతకి దిగ్గజాలు, సురభికి రోహిణి, గాంధర్వి, అనలా పుట్టారు. వీరిలో రోహిణికి పశువులు, గంధర్వికి గుర్రాలు, అనలకి కొండలు, చెట్లు, తీగలు, తీవెపొదలు, సురసకి సర్పాలు పుట్టాయి. ఇవి సకల జీవరాశి ఆవిర్భావం పుట్టిన రీతి అని జనమేజయుడుకి వైశంపాయనుడు చెప్పాడు.
వేదవ్యాసుడు చెప్పిన ఫలస్మృతి:
దేవతలు, మునులు, దైత్యులు, దానవులు, మొదలైన జీవరాశుల పుట్టుకను సావధానులై వింటున్న పుణ్యులకి అభీష్టాలైన నిత్య సుఖాలు, చిరాయువు, బహుపుత్ర లాభం, ఉన్నతమైన వైభవం, పాపక్షయం యదార్ధంగా అవుతాయి.

0 comments: