గరుడోపాఖ్యానం: 2
ఒకరోజు కద్రువ వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు దగ్గరికి వెళ్లారు. శ్వేత వర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు ఆహా ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ, అక్కా గుర్రం అంతా తెల్లగానే ఉంది కాని తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది. వినత మళ్లీ ఒకసారి పరిశీలించి లేదు చెల్లి అంతా తెల్లగానే ఉంది చూడు అంది. కాదక్క తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి కావాలంటే చిన్న పందెం వేద్దాం. తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చేయాలి. లేదంటే నేను నీదగ్గర దాసిగా చేస్తాను ఏమంటావ్? వినత సరే అని గుర్రం దగ్గరికి వెళ్తుంటే ఆగక్క చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి చూద్దాం అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది. ఇద్దరు కలిసి గృహానికి వెళ్ళిపోయారు.
ఒకరోజు కద్రువ వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు దగ్గరికి వెళ్లారు. శ్వేత వర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు ఆహా ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ, అక్కా గుర్రం అంతా తెల్లగానే ఉంది కాని తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది. వినత మళ్లీ ఒకసారి పరిశీలించి లేదు చెల్లి అంతా తెల్లగానే ఉంది చూడు అంది. కాదక్క తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి కావాలంటే చిన్న పందెం వేద్దాం. తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చేయాలి. లేదంటే నేను నీదగ్గర దాసిగా చేస్తాను ఏమంటావ్? వినత సరే అని గుర్రం దగ్గరికి వెళ్తుంటే ఆగక్క చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి చూద్దాం అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది. ఇద్దరు కలిసి గృహానికి వెళ్ళిపోయారు.
కద్రువ తన పిల్లలైన పాములందరిని పిలిచి జరిగింది చెప్పి, ఒరేయ్! నేను మీ పిన్నితో పందెం వేశాను. మీలో కొన్ని నల్ల నాగులు ఉన్నాయి. మీరు వెళ్లి ఆతోకని మీ మహిమతో కటిచిపట్టుకొని అచ్చం వెంట్రుకలులా కనపడండి. అప్పుడు మీ చిన్నమ్మ మన దాసీ అవుతుంది అనగానే, పాముల్లో కొన్ని ఛీ!నువ్వు తల్లివేనా? తప్పడు పని కోసం పిల్లల్ని ప్రేరేపిస్తావా? అమాయకులకి ద్రోహం చేస్తే ఆ పాపం వూరికే పోదు. ఏదో రోజున శాపంగా పరిణమిస్తుంది. ఛీ పో! మేము ఆపని చేయలేము అన్నాయి. కద్రువ ఆ మాటలకి కోపించి నా మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి భూడిద అయిపోతారు గాక! అని శపించింది. దాంతో ఆ పాములకి భయం వేసి సరే అని వెళ్లి ఆ శ్వేతాశ్వం తోకని పట్టుకొని, ఉదయాన్నే చూడటం కోసం వచ్చిన వినత, కద్రువాలకి నల్లని వెంట్రుకలు లా కనిపించాయి. ఆనాటినుండి కద్రువ దగ్గర దాసీగా ఉండిపోయింది వినత. చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టింది తింటూ ఎలాగో ఒక 500ఏళ్ళు గడిపేసింది. అనూరుడు చెప్పినట్టు గుడ్డు పగిలి అందులోంచి దివ్యమైన కాంతితో, బంగారు వర్ణంతో ధగధగలాడిపోతూ ఒక్కసారిగా పైకి ఎగిరేసరికి ఆ రెక్కల విసురికి సముద్రం ఆకాశమంత ఎత్తుకి ఎగిసింది. అదిచూసిన ప్రజలు ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్టు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి, పర్వతాలు కదిలిపోయి పెళ పెళ ఇరిగి కింద పడిపోయాయి. అలా ఎగిరివచ్చి తల్లి ముందు నిలబడబడ్డాడు. ఆయనే గరుత్మంతుడు. (వైనతేయుడు). ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి ఒరేయ్ మీ అమ్మ నాకు దాసీ. కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడువే. నేను చెప్పిన పనిచెయ్యి అని తన పిల్లల్ని ఊరంతా తిప్పుకురమ్మని మీద ఎక్కించింది. గరుత్మంతుడు అలా వీళ్ళని మీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా ఎగురు. ఇంకా ఎగురు అంటూ ఉంటే ఇంకా పైపైకి ఎగిరాడు. పైకి వెళ్తున్న కొద్ది సూర్యుడి వల్ల తాపం పెరిగి పాములు అన్ని సొమ్మసిల్లి పోయాయి. కిందకి రాగానే కద్రువ చూసి మీ అమ్మకి నీకు నేనంటే అలుసు, నేనన్నా నాపిల్లలన్నా మీకు గిట్టదు అని అనరాని మాటలు అన్ని అనేసి వెళ్ళింది.. అలా ఇంకో 500ఏళ్ళు గడిచిపోయాయి. గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తుంది. అంటే వినత నిస్సహాయంగా ఏమి చేయను? మీ అన్న అనూరుడు ఇచ్చిన శాపం కారణంగా దాసీ ఉండవలసి వచ్చింది అని జరిగింది అంత చెప్పింది. అది విని గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్లి పిన్ని ఏమి చేస్తే మాకు దాస్యవిముక్తి కలుగుతుందో చెప్పు అనగానే కద్రువ, నేను నా పిల్లలకి క్రోదావేశంలో బూడిద అయిపోండి అని శాపం పెట్టాను. అమృతం తాగితే ఆ యజ్ఞంలో పడిన ఏమి కాదు. అదీగాక ఇంత బలవంతుడు నాదగ్గర ఉంటే నాకే ఏదోనాటికి ప్రమాదం అని. ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్టు నాయన నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడంఇష్టమా చెప్పు?
దేవలోకంలో అమృతం ఉంది. అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్యవిముక్తి కలిగిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా దేవలోకం ఎక్కడుందో, ఎలావేళ్ళాలో కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో సరే అని తండ్రి అయిన కశ్యపుడు దగ్గరికి వెళ్లి, తండ్రి మాకు దాస్యవిముక్తి కావాలి అంటే అమృతం తీసుకుని రమ్మంది పెద్దమ్మ. ఇన్నాళ్ళు సరైన తిండి లేక నీరసించిపొయను. అంత దూరం ఎగరలేను. మంచి ఆహారం కావాలి మార్గం చెప్పండి అనగానే సరే ఐతే ఇక్కడికి దగ్గరలో మ్లేచ్చ గ్రామమున్నది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగించేస్తారు. ఏ జీవిని వదలరు. వాళ్ళు 10000మంది ఉంటారు వెళ్లి తిను. దీనివల్ల నీకు ఎలాంటి దోషం రాదు. ఇంకొక్క మాట అక్కడికి ఈమధ్య ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమిచేయకు. తండ్రీ అంత మందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడం అనగానే నీగొంతుక్కి ఎవరు అడ్డంపడి వేదిస్తాడో వాడే ఆ బ్రాహ్మణుడు. సరే అని గరుత్మంతుడు మ్లేచ్య గ్రామం వెళ్లి ఒక్కసారిగా 10000మందిని గుటుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం గమనించి, ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్టు ఉన్నారు బయటికి రావచ్చు అనగానే, నాయన ఈమధ్య ఒక బోయ స్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను. ఆవిడలేకుండా నేను రాను అనగానే బ్రాహ్మణోత్తమా నువ్వు వివాహం చెసుకున్నతరువాత ఆమె కూడా ఉత్తమురాలే. కాబట్టి ఆమెని కూడా తీసుకుని బయటికిరా అనగానే సరే అని ఇద్దరు కలిసి బయటకి వచ్చేశారు.
గరుత్మంతుడు ఈ 10000మందిని తిన్నా ఆహారం సరిపోక తండ్రి ఆహారం సరిపోలేదు. బాగా బలిష్టమైనవి ఎవైన ఉంటే చెప్పండి అనగానే ఒక్క క్షణం అలోచించి నాయనా! పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరికీ అనుకోని కలహం వచ్చి ఒకడు గజం అయిపో అంటే, ఇంకొకడు కశ్చపం అయిపో అని శపించుకున్నారు. వాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఒక సరస్సులో కశ్చపం ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యం కొట్టుకుంటూ, కొట్లాడుకుంటూ ఉంటారు. వీటిని తిను. ఒకటి ఉన్నపుడు మాత్రం దాని జోలికి మాత్రం వెళ్ళకు. అలా వెళితే దేవతలు అయిన చనిపోతారు. కాబట్టి రెండు ఉన్నపుడు ఒక్కసారిగా పట్టుకుని తిను. వారిని చంపడం వల్ల వారికీ శాపవిమోచనం అవుతుంది. నీకు ఆకలి తీరుతుంది. అనగానే గరుత్మంతుడు సరే అని వెళ్లి ఆ సరస్సు దగ్గర వున్న చెట్టుమీద నిలబడి చూస్తున్నాడు. ఇంతలో గజం నీరు తాగడానికి ఆ సరస్సులోకి దిగగానే కశ్చపం గట్టిగా పట్టుకుంది. అలా కొట్టుకుంటూ ఒకటి మునగడం, ఒకటి తేలడం. చాలాసేపటివరకూ అలా కొట్లాడుకుని రెండు ఒక్కసారిగా పైకి వచ్చేసరికి పైన ఉండి ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు గజ కశ్చపాలు రెంటిని రెండు కాళ్ళతో కరిచి పట్టుకుని రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వీటిని ఎక్కడ పెట్టుకుతినాలి అని వెతకగా 80మైళ్ళ విస్తీర్ణంలో విస్తృతంగా ఊడలు, శాఖోపశాఖలుగా ఉన్న పెద్ద మర్రిచెట్టు ఒకటి కనపడింది. చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మమీద కూర్చోగానే ఆ బరువుకి పెళ పెళ ధ్వనులతో కొమ్మ ఇరిగిపోయింది. దానికి వాలఖిల్యులు అనే కొంతమంది మునులు తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అడిగామనించిన గరుడుడు ఈ కొమ్మ కిందపడితే వాళ్ళు చనిపోతారేమోనని, లేక కిందపడి తలలు పగిలితే తనని శపిస్తారేమో అని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. రెండుకాళ్ళలో గజ కశ్చపాలు, నోటితో ఈ చెట్టు కొమ్మ పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు.గరుడుడు పరిస్థితి చుసిన కశ్యపుడు ఆ వాలఖిల్యులకి నమస్కరించి ఈ గరుత్మంతుడు నా కుమారుడు. కారణజన్ముడు. వాడిని మన్నించి కిందకి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుడిని ఆశీర్వదించి కిందకి వచ్చారు. అప్పుడు కశ్యపుడు గరుడుడితో ఈ కొమ్మని నువ్వు ఇంతకుముందు తిన్న మ్లేచ్య గ్రామం ఖాళీ అయింది కనుక అక్కడ పారవేయి ఇంకెక్కడ పడేసిన ప్రజలు చచిపోతారు అని ఆశీర్వదించి పంపించాడు. ఈ కొమ్మని ఆ మ్లేచ్య గ్రామంలో వేసి సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండమీద ఈ గజ కశ్చపాలని పెట్టుకొని తిన్నాడు! దాంతో వాళ్ళకి శాపవిమోచనం అయ్యి ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్లి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అని అడిగాడు.
1 comments:
modata garuthamnthuni thandri marichi ani rasaru tharuvatha kashyapudu ani rasaru....edi nijam?