కురువంశావిర్భావం : 3
ముందు పోస్ట్ లో మనం చెప్పుకున్నాం. రాక్షస గురువు కుమార్తె దేవయాని, బృహాస్పతి కొడుకు కచుడు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. దేవయానిని బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడు వివాహం చేసుకుంటాడని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత కొన్నాళ్ళకి వృషపర్వుడనే దానవరాజు కూతురు శర్మిష్ఠ,, రాక్షస గురువు శుక్రుడు కుమార్తె దేవయాని కలిసి ఉద్యానవనంలో విహారానికి శర్మిష్ఠ తన వేయిమంది చెలికత్తెలతో వచ్చింది. ఉద్యానవనంలో తిరిగి అలసి కొలనులో దిగి జలకాలాడుతుండగా పెద్ద గాలి వచ్చి బట్టలు ఎగిరిపోయాయి. కంగారులో దేవయాని వస్త్రాలు శర్మిష్ఠ కట్టుకుంది.
(''తగదన్యవస్త్రంభు ధరియింప''. ఒకరి బట్టలు ఒకరు ధరించకూడదు. ఇలా కట్టుకుంటే శరీరానికి అనారోగ్యం వస్తుంది. ధర్మం నశిస్తుంది. దీనివల్లే రాబోయే కాలంలో గుడ్డలు లేని జాతిగా పుడతారు. పొరపాటున కూడా ఇతరుల వస్త్రములు, చెప్పులు, జంధ్యములు ధరించకూడదు. తన వస్త్రమే కట్టుకో, నువ్వు కట్టుకున్న పంచె తీసి పక్కన పెట్టి లుంగీ కట్టుకొని తరువాత మళ్లి అదే పంచె కట్టుకోకు. శుద్ధం కాదు. మరియు అనారోగ్యం కూడాను. మనం తాగే, తినే పాత్ర కుడా ఎవరిది వారే వాడాలి. ఇంకొకరు వాడకూడదు. తాను పడుకునే మంచం మీద దుప్పటి మార్చకుండా ఇంకొకరు పడుకోకుడదు. భార్య కూడా అంతే. ''స్వకీయన్యేవ శుద్దాని, పరకీయాని నస్ప్రుసెత్'' తనవైతేనే శుద్ధం. పరులవి పొరపాటున కూడా ముట్టకూడదు.
అది చుసిన దేవయాని నా చీర ఎలా కట్టుకున్నావ్. అనేసరికి శర్మిష్ఠ కోపంతో మా తండ్రి గారి దగ్గర పని చేసే నీకు ఎందుకు అంత అహంకారం అంది. ఇలా మాట మాట పెరిగి శర్మిష్ఠ! నీకు అసలు వస్త్రాలే లేకుండా చేస్తాను చూడు అని తన చెలికత్తెలతో కలిసి ఉన్న వస్త్రాలు కూడా వూడతీసి బావిలో పడేసి వెళ్ళిపోయింది. అంతలో యయాతి మహారాజు వేటకోసమై అడవిలో తిరుగుతూ ఈ ఉద్యానవనం వైపుగా వచ్చాడు. ఎక్కడో అతి తక్కువ గొంతుతో రక్షించండి రక్షించండి అని వినపడుతుంటే వెతుకుతూ ఆ నుయ్యి దగ్గరికి వచ్చాడు. లోపల బంగారువర్ణంలో ఎవరో స్త్రీ ఉన్నట్టు తెలుస్తుంది కాని ఎవరనేది స్పష్టంగా తెలియడంలేదు. రక్షించాలి కదా అని చుట్టూ చుస్తే అందుబాటులో ఏమి లేవు. పైన ఉన్న వస్త్రం తీసి నుయ్యిలో వేశాడు.
(ఎవరైనా బయటకి వెళ్ళేటప్పుడు భుజం మీద వస్త్రం లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఇప్పటికి కుడా పల్లెటూరువారు కాని పట్టణాల్లో కొందరు భుజం మీద తువాలు వేసుకుని వెళతారు. పూజ చేసేటప్పుడు కూడా ఎడమ భుజం మీద ఒక తువాలో, లేక ఏదైనా వస్త్రమో వేసుకుంటారు. పైన ఒక వస్త్రం లేకుండా దేవతలని పూజించరాదు. పండితులు అయిన విప్రులని పూజించరాదు. భోజనం చేయకూడదు. ఇవి నియమములు.)
ఆమెను ఆ వస్త్రాన్ని పట్టుకోమంటే అందలేదు. సరేనని కట్టుకున్న పంచె వూడతీసి పైవస్త్రంతో కలిపి అందించాడు. అది అందుకొని పైకి వచ్చింది.
జంభూద్వీపం, లవణ ద్వీపం, ప్లక్ష ద్వీపము, ఇక్షు ద్వీపం ఇటువంటి 7ద్వీపములతో కూడిన ఈ భూమండలం అంతటిని తన పరాక్రమంతో పాలిస్తున్నాడు. ఆయన చేత రాజదండం పట్టుకున్నాడంటే ఈ భూమి మీద ఎవరైనా మాట వినవలసిందే. ఆ రాజదండంతో సమస్త లోకాన్ని పరిపాలిస్తున్న వర దక్షిణ హస్తంతో ఆవిడని పట్టుకుని పైకి లాగాడు. శ్రేష్టమైన, ఏపని చేయలన్నా సామర్ద్యం కలిగిన కుడి చేతితో లాగాడు. (వివాహం జరిగేటపుడు వరుడు, వధువు ఎడమ చేతిని తన కుడి చేతితో పుట్టుకుంటాడు. అంటే పాణి గ్రహణం అయినట్టు. సగం వివాహం అయ్యిందని అర్ధం. శాస్త్ర ప్రకారం.). అలా ఇక్కడ ఎందుకు చెప్పారంటే. కచుడి శాప ప్రభావం.. ఈయనే వరుడు అనే సందేశాన్ని ముందుగానే తెలియజేశారు నన్నయ్య. పైకి రాగానే దిగంబరంగా ఉన్న దేవయానిని చూసి తప్పని పరిస్థితుల్లో చూడవలసి వచ్చింది అని పై కండువా తీసి కట్టుకోమని ఇచ్చాడు. దేవయాని యయాతి చేయి పట్టుకొని ఎక్కడికి వెళతావు. నువ్వు నా చేతిని పట్టుకుని పాణిగ్రహణం గావించావు. కాబట్టి నువ్వే నా భర్తవి అన్నది. యయాతి ఆశ్చర్యపోయిఅసలు ఎవరునువ్వు? నేనేదో నిన్ను రక్షించాలి అని పైకి లాగితే ఇలా అనడం భావ్యం కాదు అనగానే నేను రాక్షస గురువు శుక్రాచార్యుడి కుమార్తెను దేవయానిని అన్నది. అప్పుడు యయాతి ! నువ్వు సుందరివి, బ్రాహ్మణ స్త్రీ వి, గోప్పదనివే, గురువుగారి పుత్రికవి, నిన్ను వివాహం చేసుకుంటే గురువు గారికి కోపం వస్తుందేమో అన్నాడు. మానాన్న గారు నేను గీచిన గీత దాటడు, నా మాట కాదు అనడు కాబట్టి నన్ను వివాహం చేసుకో అంటే సరే చూద్దాం ముందు ఇంటికి వెళ్ళు అని యయాతి కూడా వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి శుక్రాచార్యుడితో నాన్నగారు ఈ క్షణమే మీ పదవిని వదలండి అనగానే ఏమైందమ్మా అని అడిగాడు శుక్రుడు. దేవయాని జరిగిందంతా చెప్పి యయాతి మహారాజు నన్ను రక్షించి ఉండకపోతే ఈపాటికి నేను ఎమైపొయెదాన్నొ అని ఏడ్చింది. దాంతో శుక్రుడికి కోపం వచ్చి ఈ రాక్షసులు ఎంత కృతఘ్నులు! మీపిల్లలం అని చెప్పి రక్షించండి అని కాళ్ళమీద పడి చివరికి నాకుతురినే చంపడానికి ప్రయత్నిస్తారా? ఇలాంటి వారి దగ్గర ఉండటం కంటే వెళ్ళిపోవడం ఉత్తమం అని రాజుగారైన వృషపర్వుడుకి కబురుపెట్టి కూతురిని తీసుకుని వెళ్ళిపోయాడు. వృషపర్వుడు పరుగు పరుగున వచ్చి శుక్రచార్యుడిని కలిసిమహాత్మా! శుక్రాచార్య! నువ్వు కోపగిస్తే లోకాలు ఆగుతాయా? నువ్వు మామీద ప్రయోగం చేయడం లేదు కానినిన్ను ఎదిరించి నిలువగలమా? నీ తపశ్శక్తిని ఉపయోగిస్తే మా కులం అంత భూడిద అయిపోదా? నువ్వు తోడుగా ఉండటం వలన ఇన్నాళ్ళు రాజ్యపాలన చేశాను. నువ్వు వెళ్ళిపోతే మేము ఏకాకులం అయిపోతాం. అసలు మీరు లేకపోతె రాక్షస జాతి ఎమైపోయేది? దేవతల చేతిలో రాక్షసులు చనిపోతుంటే నీ మంత్రశక్తితో కదా బ్రతికిస్తున్నావ్! ఏమి జరిగిందో చెప్పు. ఏది కావాలంటే అది చేసి పెడతాను అని పాదాలపై పడ్డాడు.
నీకూతురు నాకుతురిని నుయ్యిలో పడేసింది. నాకూతురు నీదగ్గర వుద్యోగం మానేయమన్నది. నేను నీ వద్దకి మళ్ళి రావాలంటే నువ్వెళ్ళి నాకూతురిని పట్టుకో అన్నాడు.
వృషపర్వుడు దేవయాని దగ్గరికి వచ్చి ఓ భార్ఘవి, అలైక స్వర్గవి. (స్వర్గవి అంటే కామధేనువు.. కోరిన వరములు ఇస్తుంది కాబట్టి ఇలా సంభోదించాడు). ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితె కాదనకుండా వరములు ఇచ్చె పవిత్రమైన మనస్సు కలిగినదాన! నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. మీ నాన్నగారిని మాత్రం మాకు గురువుగా అప్పగించు అనగానే రాజుగారిని చూసి జాలిపడి మహారాజ నాకు మీమీద ద్వేషం కాదు. నీ కూతురు నన్ను చంపబోయింది. అదృష్టం ఉండి ఆయువు ఉండి బట్ట కట్టాను. లేకపోతె బట్టలేకుండా చనిపొయెదాన్ని. నాకు నీ కూతురి మీదే కోపం. నీ కుమార్తెని తన వేయిమంది చెలికత్తెలతో సహా నాకు దాసిగా పంపించు అప్పుడు మీదగ్గరికి మా నాన్నని పంపిస్తాను అనగానే. నాకు నా రాజ్యం ముఖ్యం, ప్రజల బాగోగులు ముఖ్యం. కూతురు కంటే ఇంతటి సువిశాలమైన రాజ్యాన్ని, ప్రజలని కాపాడటం ధర్మం కనుక సంతోషంగా నా కూతురిని ఇచ్సెస్తున్నాను అని ఆవిడతో పాటు నూతిలోకి తోసిన 100మంది చెలికత్తెలతో పాటు ఇచ్చేసి ఈ రోజునుండి వీరంతా నీకు దాసిజనం అన్నాడు. అప్పుడు దేవయాని కోపం చల్లార్చుకుంది. యధాతధంగా శుక్రాచార్యుడు మళ్లి తన గురు స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక తరువాత యయాతి మహారాజు గారిని పిలిపించి శుక్రాచార్యుడు పెళ్ళికి అంగీకరించి శుభ ముహూర్తంలో దగ్గర ఉండి వివాహం చేశాడు. కచుడు శాపం వల్ల, నువ్వు వస్త్రం ఇచ్చి రక్షించడం వల్ల, అన్నిటికి మించి కుడిచేతితో పట్టుకుని పైకి లాగడం వల్ల (''త్రివిదైహి కారణైహి'' అన్నాడు వ్యాసుడు. మూడు కారణములు చెప్పాడు). వివాహం చేసుకున్నాను అన్నది దేవయాని. (వివాహం అనేది తాత్కాలిక కామోద్రేకంలో చేసుకోవడం కాదు. పవిత్రమైన మనస్సు ఉండాలి. ధర్మ బద్దమై ఉండాలి.) కచుడు శాపం అనుభవించాలి, నేను వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు నువ్వు చూశావు, కుడిచేతితో పట్టుకుని పైకి లాగి వస్త్రం ఇచ్చావ్. కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చేవాడు భర్త అవుతాడు. ఈ కారణాలు మూడింటివల్ల నేను నీ భార్యని అవుతున్నాను అన్నది. వివాహం జరిగింది.

0 comments: