కురువంశావిర్భావం : 4
శుక్రాచార్యుడు కుమార్తెని కాపురానికి పంపిస్తూ శర్మిష్ఠ అని పిలవబడే ఈమె సామాన్యురాలు కాదు. ఆమె చేసిన చిన్న దోషం వల్ల నా కూతురికి దాసీ అయ్యింది. ఈవిడ రాక్షసరాజు కుమార్తె..తన వందమంది చెలికత్తెలతో కలిసి నీతోపాటు వస్తుంది. దేవయానికి వీరు దాసదాసి జనం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఈవిడ చాల ఉత్తమురాలు. దేవయానిని ఎలా చుసుకుంటావో అలాగే చూసుకో మంచి వస్త్రాలు, ఉండటానికి మంచి భవనం, తినే ఆహారం ఇలా దేనిలో లోటు లేకుండా చూసుకో కాని వివాహం మాత్రం చేసుకోకు. పాన్పు పైకి తీసుకేళ్ళకు. మిగతా తక్కిన విషయాలలో దేవయానితో సమానంగా చూసుకో అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయించాడు.. ఇక అక్కడి నుంచి బయలుదేరి రాజ్యానికి వెళ్లారు. క్రమంగా దేవయానితో బ్రహ్మానందంగా కాపురం చేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు యదువు, తుర్వసుడు పుట్టారు. కొద్దికాలం గడచింది. ఒకరోజు మహారాజు తనభార్య లేకుండా ఉద్యానవనం లో తిరుగుతున్నాడు. పురిటి నీళ్ళు పోసుకొని ఎక్కువ కాలం కాకపోవడంతో దేవయాని రాలేదు. యయాతి ఉద్యానవనంలో తిరగడం శర్మిష్ఠ చూసి అక్కడికి వచ్చి! మహారాజ నేను రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తెని. పరమ సౌందర్యవతి ని. నా చెలికత్తె చక్కగా పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందింది. నా అందం అడవికాచిన వెన్నెలలాఉంది నా సౌందర్యం. అందునా నేను ఋతుమతిని అయ్యాను. ఏ ఆడదానికైనా వివాహం చేసుకొని భర్త, పిల్లలతో సంతోషంగా జీవించాలని ఉంటుంది. సాటి రాజువి. మన్నించి నన్ను వివాహం చేసుకొని నా కోరిక నెరవేర్చండి అని వేడుకుంది. అప్పుడు యయాతి. నీ మీద మోహం ఉన్న మాట వాస్తవమే కాని గురువుగారికి ఇచ్చిన మాట తప్పకూడదు కదా! మాటిచ్చి బొంకకుడదు కదా అన్నాడు. మహారాజ కొన్నిసందర్భాలలో బొంకవచ్చు అని కొన్ని ఆపద్ధర్మ సూత్రాలు చెప్పింది శర్మిష్ఠ.
ప్రాణం పోయేటపుడు, ప్రాణాపాయ స్థితిలో ఎట్టి పరిస్థితులలో సత్యం చెప్పనవసరంలేదు. సంపద పోయేటపుడు అసత్యం ఆడవచ్చు. చావడానికి సిద్దంగా ఉన్న బ్రాహ్మణుని రక్షించడానికి, స్త్రీ సాంగత్యానికి అసత్యం ఆడవచ్చు. వివాహ సమయములందు బొంకవచ్చు. ఇలా అత్యావశ్యక సమయాలలో అసత్యం ఆడవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు బొంకితే అసత్య దోషం చుట్టుకుంటుంది. ప్రాణాపాయ సమయంలో, వివాహ సమయంలో అసత్యం ఆడితే అది సత్యాతిశయం కంటే గొప్పది. అందునా నా బోటి పరమ పవిత్రమైన స్త్రీ సాంగత్యంలో తప్పులేదు అంది.
(వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ, మాన విత్తభంగమందు చకిత గొకులాగ్రజజన్మరక్షణ మందు బొంకవచ్చు నగుము పొందదిప!) ఇవి ధర్మసూక్ష్మాలు. వేద రహస్యాలు.
అందువల్ల నన్ను పెళ్ళిచేసుకుని లేదని అబద్దమాడు అనేసరికి సరే అని గాంధర్వ వివాహం చేసుకున్నాడు(మేడలో దండ వేస్తె పెళ్లి అయిపోయినట్టే. మంత్రం, తాళి అవసరంలేదు) కొన్నాళ్ళకి వీరిద్దరికీ మాంచి అందమైన బలమైన కొడుకు పుట్టాడు. వీడు ఉద్యానవనంలో ఆడుకుంటుంటే దేవయాని చూసి అంతఃపురం కంటే అధికమైన కట్టుదిట్టంగా ఉండే ఈ ఉద్యానవనంలో ఉండే భవనంలో నివసించే నీకు ఈ సంతానం ఎలా కలిగాడు అని అడిగితె! ఒకనాటి రాత్రి ఒక గంధర్వుడు వచ్చి వరం ఇచ్చాడు. ఆ దేవతా అనుగ్రగంతో సంతానాన్ని పొందాను అన్నది శర్మిష్ఠ. నిజమే అనుకుని వెళ్ళిపోయింది దేవయాని. ఇంకొన్నాళ్ళకి ఇంకో ఇద్దరు సంతానం కలిగారు. ద్రుహ్వి, అనువు, పురు అనే ముగ్గురు సంతానం. ఈ ముగ్గురు పిల్లలు తల్లితో కలిసి ఉద్యానవనంలో తిరుగుతున్నారు,. ఇంతలో దేవయాని తనపిల్లల్ని తీసుకుని వచ్చింది. రాగానే శర్మిష్ఠ దగ్గర ఉన్న ముగ్గురు పిల్లలు, దేవయాని దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు వెళ్లి తండ్రి కాళ్ళకి నాన్న నాన్న అనుకుంటూ పెనవేసుకున్నారు. దేవయానికి అనుమానం వచ్చి ఇంతకు ముందు అడిగితె దేవత వరం అన్నది, కొంచం పెరిగిన తరువాత చుస్తే అచ్చు గుద్దినట్టు యయాతి మహారాజు లాగా వున్నారు. అని ఈసారి పిల్లల్ని పిలిచి మీతండ్రి ఎవరు అని ఆడిగింది. ఈయనే అన్నారు. దేవయాని స్తంభించిపోయి! నేను ఏ స్త్రీ ని శాశ్వతంగా అణగద్రొక్కి వివాహం కాకుండా చేయలనుకున్నానో ఆ స్త్రీ నాకు శాశ్వతంగా సవతి అయ్యికుర్చుంది (ఎప్పుడైనా ఎవరిననైన మరీ అణగ ద్రోక్కాలనుకుంటే వారు మళ్లి విజ్రుంభిస్తారు.) అనుకోని గొల్లున ఏడ్చి తండ్రి దగ్గరికి వెళ్ళింది.

1 comments:
Dear Author.. Your blog is nice. But try to imrove the google page rank by adding other posts links in new posts. And at the bottom try to place previous post and next posts links. So more readers can easily go for the next part. Because all your posts are sequals. Any way really good effort.