ఆదిపర్వం: మూడవ అశ్వాసం: పోస్ట్ - 26

కురువంశావిర్భావం : 5

     శుక్రాచార్యుడితో దేవయాని నాన్న ఇలా జరిగింది అని చెప్పగానే, ఆయన కూడా వెనకా ముందు ఆలోచించకుండా మూర్ఖుడా నేను ఏమి చెప్పాను. ఆ స్త్రీని పొరపాటున కూడా ముట్టుకోవద్దు అంటే నువ్వు ఏకంగా పెళ్లి చేసుకున్నావు. సంతానాన్ని ఇచ్చావు. నువ్వు యవ్వన మదంతో ఈ పని చేశావు కనుక ముసలివాడివి అయిపో అని శపించాడు.(వార్ధక్యం వచ్చు గాక!).  మరుక్షణంలో యయాతి మహారాజు శరీరం కదిలిపోయి, జవసత్వాలు ఉడిగిపోయి, ముఖం అంత ముడతలు పడి, పళ్ళు ఊడిపోయి, చేతులు, కాళ్ళు వణకడం మొదలయ్యింది. తల ఊగిపోతుంది. జుట్టు తెల్లబడిపోయింది. అప్పుడు కంపిస్తున్న శరీరంతో క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు. మామగారు మీరు క్షణికొద్రేకంలో శపించారు. ఇంకా నాకు కమోపభోగాల్లో కోరికపోలేదు.  ఆ పై నీ కుమార్తె అంటే నాకు నిజంగా నాకు ప్రేమ. ఏదో క్షణికమైన మోహంలో ఇది జరిగిపోయింది. ఇప్పడు నేను ముసలివాడిని అవ్వడంవల్ల భాధ ఎవ్వరికి? నీ కుమార్తెకే కదా! అనగానే దేవయాని తండ్రి పాదాలపై పడి నాన్న నువ్వు తొందరపడి శపించావు. నువ్వు శపించింది ఆయన్ని కాదు నన్ను అని వలవలా ఏడ్చి నాగతి ఏంటి అనిఅడిగింది. శుకచార్యుడికి మళ్ళి కోపం వచ్చి కూతురితో! అందుకే మాటిమాటికి నాదగ్గరికి వచ్చి ఎడవద్దు అన్నాను. నువ్వు ధుఖించెసరికిక్షణికావేశం లో శపించేశాను. సరే ఈశాపం నేను తిప్పుకోలేను. కాని మార్పు చేస్తాను. నీకొడుకులు ఎవరైనా ఈ ముసలితనం తాత్కాలికంగా స్వీకరిస్తే వారి యవ్వనం నీకు వస్తుంది. అది కొంతకాలం స్వీకరించి నీ కోర్కెలు తీర్చుకుని తిరిగి ఇచ్చేయి. అలా తీసుకున్నవాడికే రాజ్యం ఇవ్వు అని శాపాన్ని మర్పుచేశాడు. యయాతి మహారాజు రాజ్యానికి వెళ్లి తన అయిదు గురు సంతానాన్ని పిలిచి వివరించాడు. మొదట పెద్ద కొడుకు యదువుని పిలిచి ఏమంటావ్ నాయన అంటే అన్నిటికంటే భయంకరమైనది ముసలితనం (రోతలకి ఎల్లా ముదిమి రోతకాదే!). మేము వయసులోకి వస్తున్నవాళ్ళం. ఎల్లకాలం ముసలి వాళ్ళే రాజ్యం పాలిస్తే మేం ఏంచేయాలి? కుదరదు పో! అన్నాడు. మిగతా ముగ్గురు కూడా కాదని తలలు వంచుకున్నారు. చివరికి అందరికంటే చిన్నవాడు పూరువు వచ్చి నాన్న! తండ్రికంటే దైవం ఇంకొకడు లేడు. మాత, పితరులే నిజమైన ప్రత్యక్ష దేవతలు. తండ్రి సేవకోసం ప్రాణం ఇవ్వడం కూడా ధర్మమే! నీ ముసలితనం నాకు ఇచ్చేయి,. అసలు ఆ యవ్వనం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు. కొడుకుని మెచ్చుకొని నీలాంటి తనయుడు ఒక్కడున్నాచాలు. తండ్రికి మోక్ష సిద్ది లభిస్తుంది అని తన ముసలితనం కొడుకుకి ఇచ్చి, కొడుకు యవ్వనం తను స్వీకరించి హాయిగా 60,000 సంవత్సరాలు కామోపభోగాల్లో మునిగితెలాడు. చివరికి ఒకనాడు ఛీ ఈ యవ్వనం వల్ల ఏమిటి ఉపయోగం? అదుపులేని కోరికలు పుడుతూనే ఉన్నాయి. ఈ కామం(కోరికలు) తీర్చుకుంటే పుడుతూనే ఉంటాయి కానీ తరగవు. మానవుడై పుట్టిన వాడికి కోరికలు పుడుతూనే ఉంటాయి కాని గతించవు.
     (ఒక వ్యక్తికి తాగుడు అలవాటు అయితే ఎవ్వరు ఎన్ని చెప్పినా పట్టించుకోడు. తిండి వ్యసనం కొందరికి ఇది నచ్చింది అని తింటాడు. కొద్దిగా ముందుకి వెళ్ళాక ఇంకొకటి నచ్చితే మళ్ళి తింటాడు. వీటిలో ధన సంపాదన మరీ ప్రమాదమైనది. సంపాదించిన కొద్దీ ఇంకా ఇంకా అంటూనే ఉంటారు కాని ఒద్దు అని మాత్రం అనరు. అలా అడ్డగోలుగా ప్రజలని మోసం చేసినవారు ఏమైయ్యారో అందరికి తెలిసిందే. ఏరుకోడానికి ఎముకలు కూడా మిగల్లేదు. యజ్ఞగుండం లోని మంటలు నెయ్యి పోస్తున్న కొద్దీ మంట పైకి లేస్తూనే ఉంటుంది. అలాగే కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా ఇంకా అంతకంతకీ పుడుతూనే ఉంటాయి.)
ఇటువంటి  కోరికలతో కూడిన శరీరం అనవసరం అనుకుని భార్యతో! చూశావ? యవ్వనంతో ఒక గోర్రేపోతులా తయారై ఆడగొర్రె లాంటి నీమీద వ్యామోహంతో బ్రతికేస్తున్నాను. ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను అనగానే దేవయాని కూడా నేను వస్తాను అంది. పూరువుని పిలిచి తన యవ్వనం ఇచ్చేసి వృద్దాప్యం తీసుకున్నాడు. యదువుతో! నువ్వు నామాట దిక్కరించావు కనుక మీ యాదవ వంశానికి రాజ్యార్హత లేకుండుగాక! యాదవ వంశంలో పుట్టినా అవులని గోర్రేలని కాచుకుంటూ వుందురు గాక!  అని శపించాడు. అందుకే యదువంశంలో కృష్ణుడు పుట్టిన సింహాసనం తను తీసుకోకుండా కంసుడి తండ్రి భోజరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తుర్వసుడిని కూడా నీ వంశంలో సంతానం లేకుండుగాక అని శపించాడు. అందుకే తుర్వసుడుకి కొడుకులు లేరు విష్ణుమూర్తి కొడుకుని పెంచుకున్నాడు. ఆ విష్ణుమూర్తి కొడుకు హై హై వంశాన్ని స్థాపించాడు. పూర్వం విష్ణుమూర్తి భూలోకానికి గుర్రం రూపంలో వచ్చి లక్ష్మిదేవి తో కలిసి ఒక పుత్రుడిని కన్నాడు. హయమునకు హయమునకు పుట్టడం వల్ల ఆకుర్రాడిని హైహైయుడు అన్నారు. ఆ తుర్వసుడి వంశంలో వాడే శ్రీకృష్ణ దేవరాయలు కూడా! మూడవ కొడుకు ద్రుహ్వుడు ని కట్టెలు కొట్టుకుని బ్రతకమన్నాడు. ఆ వంశంలో వారె అడవుల్లో కట్టెలు కొట్టుకుంటూ, జంతువులని వేటాడుతూ బ్రతికారు. అనువుని పిలిచి మీ వంశం వారు వ్యవసాయం చేసుకుని బ్రతకమన్నాడు. ఆ వంశంలోని వారు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఆఖరి కొడుకు పూరువుని పిలిచి నువ్వు ఒక్కడివే నామాట విన్నావు కనుక మీ వంశం వారు రాజ్యం ఏలుతారు అని అస్తినాపుర సింహాసనాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. ఈ పూరువు వల్ల మొదట పౌరవవంశం అని పిలవబడింది.. ఈ వంశంలో కురు అనే మహారాజు జన్మించడం వల్ల అయన పేరు మీద కురువంశం పేరుతొ ఆవిర్భవించింది. అయన అలా రాజ్యాన్ని పురువుకి అప్పగించి అడవికి వెళ్లి మహా తపస్సు చేసి ఆ తపశ్శక్తితో స్వర్గానికి వెళ్లిపోయాడు. 
Next
Previous