ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 29

పురువంశ క్రమము : 1

ఈ కథను చెపుతున్న ఉగ్రశ్రవుడు సౌనుకాది మునులకి పురువంశ క్రమం చెపుతూ,

       యయాతి పుత్రుడు పూరుడు సకల మహీరాజ్యం ఏలుతూ తన వంశకర్త అయిన అదే పేరుగలిగిన పూరుడికి కౌశల్యతో వివాహం జరుపగా వీరికి జనమేజయుడు జన్మించాడు, జనమేజయుడు మూడు అశ్వమేధయాగాలు ఆచరించి ప్రసిద్దికేక్కాడు. జనమేజయునకు అనంత అనే కన్యకు వివాహం జరుపగా వీరికి ప్రాచిన్వంతుడు జన్మించాడు. ప్రచిన్వంతునకు ఆశ్వకి సంయాతి పుట్టాడు. సంయాతి వరంగికిఅహంయాతి జన్మించాడు. అహంయాతికి క్రుతవీర్య పుత్రిక అయిన భానుమతికి సార్వభౌముడు జన్మించాడు. సార్వభౌమునకు కైకేయ రాజ పుత్రిక సునందకు జయత్సేనుండు పుట్టే, జయత్సేనునకు విదర్భరాజు పుత్రిక మర్యాదకు పుట్టే, అరిహుండునకు అంగి అనే దానకు మహాభౌముడు పుట్టే, మహాభౌమునకు ప్రసేనజిత్ పుత్రి అయిన సుపుష్టకు ఆయతానీకుడు పుట్టే. ఆయతానీకునకు పృధశ్రవుని కుమార్తె కామకు అక్రోధుడు పుట్టే. అక్రోధునకు కళింగ రాజు కుమార్తె కరంభకు దెవాతిథి పుట్టే, దెవాతిథి కి విదేహరాజు కుమార్తె మర్యాదకు ఋచీకుడు పుట్టే. ఋచీకునకు అంగరాజు కుమార్తె సుదేవకు రుక్షుండు పుట్టే. ఋక్షునకు తక్షకుని కూతురు జ్వాలకు మతినారుడు పుట్టాడు.
      మతినారుడు సరస్వతి నది తీరంలో 12 సంవత్సరములపాటు నియమ నిష్టలతో, శ్రద్ధా భక్తులతో సత్రయాగం చేశాడు. సరస్వతి నదికి తన మనస్సులో అనురాగం కలగడంచేత అతనిని ధర్మ మార్గంలో వివాహం చేసుకున్నది. వీరికి త్రసుడు అనేవాడు పుట్టాడు. త్రసుడికి కాళిందికి ఇలినుడు జన్మించాడు. ఇలినుడుకి రథంతరికి దుష్యంతుడు పుట్టాడు.

దుష్యంతుని చరిత్ర : 1
         దుష్యంతుడు అనంతమైన బలం కలవాడై శత్రురాజులు జయింప సఖ్యంకాని వాడై  సర్వభూమండలాన్ని పరిపాలించాడు. ప్రజలు కామ, క్రోధ లోభ, మొహాలు వదిలి, సత్య, శౌచ, ధర్మ మార్గాలు అనుసరించి రోగాలు కూడా అంటని సుభిక్ష రాజ్య పరిపాలం కొనసాగిస్తున్నాడు. ఒకనాడు వేట వేడుకతో సూర్యుని రధానికి కట్టి ఉండే గుర్రాలకన్నా వేగవంతమైన గుర్రాలని త రధానికి కట్టి పెక్కుమంది గుర్రాలని ఎక్కిన ఆశ్వికులు వెంటరాగా వేట వేడుకకి 
Next
Previous