ఆదిపర్వం: మూడవ అశ్వాసం: పోస్ట్ - 28

కురువంశావిర్భావం : 6

జీవజాతులు ఆవిర్భావం, దేవయాని శర్మిష్టల కొట్లాటలో శర్మిష్ఠ దేవయానిని భావిలో పడదోయడం, యయాతి మహారాజు దేవయానిని రక్షించడం, శర్మిష్టని దేవయాని దాసిగా చేసుకోవడం, యయాతి మహారాజు దేవయాని వివాహం, తరువాత శర్మిష్టని వివాహం చేసుకొని యయాతి సంతానాన్ని పొందడం, ఆ విషయం తెలిసి శుక్రాచార్యుడు యయాతిని ముసలివాడిగా అయిపోమని శపించడం. యయాతి తన పుత్రుడు పూరువుకి ముసలితనాన్ని ఇచ్చి యవ్వనం స్వీకరించి 60000సంవత్సరాలు కొమోపభోగాల్లో మునిగితేలి ఒకనాడు విరక్తితో పూరువుకి రాజ్యం ఇచ్చి మిగిలిన సంతానాన్ని శపించి ఘోర తపస్సు చేసి స్వర్గానికి వెళ్లి ఆత్మస్తుతి చేసుకొని ఇంద్రుడి ఆగ్రహానికి గురిఅయ్యి నక్షత్ర మండలంలో ఉండటం, తన కూతురి సంతానం అష్టకులు ధర్మసూక్ష్మాలు యయాతి మహారాజు ద్వారా తెలుసుకొని తిరిగి స్వర్గానికి పంపడంతో తృతీయ ఆశ్వాసం ముగిసింది.. 
Next
Previous