ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 7

ఉగ్రశ్రవుడు శౌనకాది మునులకి చెప్పనారంభించాడు

గరుడోపాఖ్యానం:
బ్రహ్మ మానస పుత్రులలో మరీచి అనే పుత్రుడు ఒకడున్నాడు. ఆయనకి కశ్యపుడు.అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60మంది కుమార్తెలలో అథిది, తిధి, వినత, కద్రువ, వినత మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిధి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. తిధి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు వారందరిని ''దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరిని నాగజాతి వారు అన్నారు.
ఇక కద్రువ, వినత చాలాకాలం కస్యపుడికి సేవ చేయడం వలన ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు 1000మంది సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆతరువాత వినత వీరికంటే అసాదరణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించే ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం చేసే ''పుత్రకామేష్టి'' యాగం చాల రోజులపాటు చేశాడు. ఆతరువాత కద్రువకి పిండం పుడితేఆ పిండాన్నినేతి కుండలో భద్రపరిచింది. వినతకి రెండు గుడ్లు పుట్టాయి. అలా 500 సంవత్సరాలకి కద్రువకి  ''వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, తో పాటు ధనుంజయుడు, ఖాళీయుడు, మణి నాగుడు, అపురణుడు, సురాముఖుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగకుడు, కలశపోతకుడు, ధదిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, శంఖుడు, వాలిశికుడు, నిష్టానఖుడు, హేమసహుడు, నహుషుడు, పింగళుడు, బహ్యకర్ణుడు, హస్తిపాదుడు, ముద్గురుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు, వీరితో కలిపి 1000మంది  సర్పాలు పుట్టాయి. కాని వినత నా గుడ్లు మాత్రం పగలలేదు. కద్రువకి మాత్రం 1000మంది పాములు పుట్టాయి అనే అసూయతో ఒక గుడ్డుని పగలగొట్టింది. అందులోనుండి ఊరువులు(తొడలు) ఇంకా తాయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు! ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు అన్న నామదేయం ఏర్పడింది. (అన్+ఊరుడు= అనూరుడు)తొడలు లేని వాడు అని అర్ధం. అలా పుట్టగానే తన తొడలు చూసుకొని ఎంత ఆపని చేశావ్ అమ్మా! ఇంకో 500సంవత్సరాలు కానీ ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కాదమ్మా! నీ సవతిమీద అసూయతో ఇలా చేశావు కనుక ఆ సవతికి దాసివి ఐపో అని శపించాడు. దానికి వినత భాదపడి నాయన తల్లి ఎంత మంచిది కాకపోయినా బిడ్డలు ఇలా శాపం ఇవ్వోచ్చునా? అని కన్నీరు పెట్టుకోగానే సరే ఇంకో 500సంవత్సరాలు ఆ గుడ్డుని మాత్రం కదిలించకు. అందులోనుంచి ఓ అద్భుతమైన శక్తితో అతిబలవంతుడు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని వెళ్ళిపోయాడు. (ఇప్పుడు ఉదయం పూట సూర్యుడు రధం నడిపే అనూరుడే ఈ అనూరుడు).
Next
Previous