పైలుడు తనభార్య వ్రత ఉజ్జపన కోసం పరమ పవిత్రమైన కుండలాలు తీసుకుని రావడానికి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడని తెలిసి దిగులు పడటం,(ఎందుకు దిగులు పడ్డాడో మనకి అశ్వమేధపర్వంలో వస్తుంది) అలా వెళ్ళిన ఉదంకుడుకి నీగురుభక్తి కారణంగా నువ్వు తలపెట్టిన కార్యం నిర్విగ్నంగా పూర్తి అవ్వడంకోసం ఇంద్రుడు ఎద్దుమీద వచ్చి నిన్ను పేడ తినమన్నాడు. ఆతరువాత నువ్వు తీసుకొస్తున్న కుండలాలు తక్షకుడు అపహరించి పాతాళలోకంలోకి వెళ్ళిపోతే వాయుదేవుడు వచ్చి నీకు పలుగు ఇవ్వడం, దానితో నువ్వు పుట్ట తవ్వగానే పాతాళలోకానికి మార్గం ఏర్పడటం, అక్కడ కాలగమనం తిలకించడం, తెలుపు, ఎరుపు చెవులతో ఉన్న అగ్నిహోత్రుడు గుర్రం రూపంలో వచ్చి పాతాళాన్ని తగలబెట్టడం, కుండలాలు తీసుకుని ఆగుర్రాన్ని ఎక్కి మనోవేగంతో వచ్చావని ఇదంతా కేవలం నీ గురుభక్తి కారణం అని చెప్పి నువ్వు దూషించినా నీకు గురుభక్తి కారణంగా దేవుళ్ళు ప్రసన్నం అవుతారని వరం ఇచ్చి పంపిస్తాడు!
విష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే పుట్టుమచ్చ నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. శ్రీవత్సం నుంచి పుట్టుకురావడం వలన అతడికి బృగువు అనే నమదేయం ఏర్పడింది. శ్రీవత్స గోత్రుడు అయ్యాడు. ఆతరువాత బ్రహ్మదేవుడు పిలిచి నువ్వు ప్రజపతిగా నేను చెప్పిన పని చెయ్యి అని బ్రుగువుని ఉచ్వాసం ద్వార లోపలికి పీల్చి, నిచ్వాసం ద్వార బయటికివిడిచిపెట్టాడు. లోపలికి తీసుకుని బయటికి వదిలాడు కాబట్టి ''బ్రహ్మ మానస పుత్రుడు'' అయ్యాడు. ఈయనికి చాలామంది భార్యలు ఉన్నారు. వారిలో ఖ్యాతి అనే ఒక భార్య ఉన్నది! ఈవిడకి లక్ష్మి పుట్టింది. అందుకే లక్ష్మికి భార్గవి అని పేరు. ఇంకోభార్య పేరు పులోమ. ఈవిడని పులోముడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయే ఘట్టం..
ఇలా ఈ పైలుడు-ఉదంకుడు-పౌష్యుడు, బృగువు-రురువు చరిత్రతో మహాభరతంలో ఆదిపర్వం మొదటి ఆశ్వాసం ముగించాడు వ్యాసుడు!
రెండో ఆశ్వాసం అత్యద్బుతమైన ''గరుడోపాఖ్యనం'' తో ప్రారంభం అవుతుంది.
0 comments: