ఆదిపర్వం: రెండో అశ్వాసం; పోస్ట్ - 15

పరిక్షిత్తుని తక్షకుడు కాటేయడం: 4
ఆతరువాత తక్షకుడు పరీక్షిత్తు ఉంటున్న సుఖస్థలం దగ్గర గంగానదిలో ఏర్పరచిన ఒంటిస్థంభం మెడ దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఏదో అక్కడ రక్షణ గ ఉన్న మంత్రశక్తి లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది. మళ్లి మళ్లి ప్రయత్నించి విఫలుడై బాగా అలోచించి తన మిత్రులని పిలిచి గడువు సమీపిస్తున్నది. నేను లోపలి వెళ్ళడానికి ఈ భవనాన్ని మంత్రాలతో దిగ్భందనం చేశారు. మీరు బ్రాహ్మణ రూపాలు ధరించి, మీకు గండం తప్పించడానికి పూజలు చేసి పళ్ళు తీసుకుని వచ్చామని చెప్పండి. విప్రుల మీద ప్రత్యెక అభిమానం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడ్డుకోరు.. నేను ఆ పండులో దాగుతాను. అప్పుడు మంత్రశక్తులు నామీద పనిచేయవు. మీరు బ్రాహ్మణులు కనుక భటులు లోపలి వెళ్లనిస్తారు అని ఒక పండులో దూరి లోపలికి వెళ్ళాడు. పరీక్షిత్తు ఆ పండుని తీసుకుని తినబోతుంటే తుమ్మెదలా బయటకి వచ్చి పెద్ద భయంకరమైన సర్పంలా మారిపోయి కటేశాడు. క్షణాల్లో పరీక్షిత్ దగ్ధం అయిపోయాడు.
Next
Previous