కురువంశావిర్భావం : 6
తపశ్శక్తి ప్రభావం వల్ల ఇంద్రుడు తన దగ్గర పక్కనే సింహాసనం వేసి కూర్చోబెట్టుకున్నాడు. దీనితో యయాతికి కొంచెం గర్వం వచ్చింది. ఇంద్రుడు ఒకనాడు ఇష్టాగోష్టిలో యయాతిని నువ్వు ఏమి ఘనకార్యం చేసి ఈ స్వర్గానికి వచ్చావు అన్నాడు. అప్పుడు యయాతి! నేను నా కుమారుడికి రాజ్యం ఇచ్చి గొప్ప ధర్మభొధలు చేశాను. ధర్మశాస్తాల్లో నా అంత గొప్పవాడు లేడు. ఇంకా నా కుమారుడికి. గొప్పవాళ్ళ చరిత్రలు చదువు, మహాత్ముల చరిత్రలు విను, ఎప్పుడైనా పూజ్యులైన, మహానుభావులైన, చరిత్రలు విన్నవాడికి ధర్మం పెరుగుతుంది. అధర్మం నశిస్తుంది. కీర్తి పెరుగుతుంది, అపవిత్రత తొలగుతుంది. పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఎల్లప్పుడూ ఉత్తముల చరిత్రలు విను. సజ్జనులతో సాంగత్యం విడిచిపెట్టకు. దుర్జనులతో స్నేహం చేయకు. ధర్మాన్ని ఎల్లపుడు పరిపాలించు. ధర్మ సూక్ష్మాలు ఎప్పటికప్పుడు తెలుసుకో. తెలుసుకున్న ధర్మ సూక్ష్మాలు మరిచిపోకూడదు. నేమరవేసుకో. మర్చిపోకుండా అమలుచేయ్యి. అనుష్టించు . ఆచరించు. ఇంకా దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, మహాత్ములని రక్షించు అని చెప్పాను. ఇంత ధర్మాలు ఎవరైనా చెప్పారా? నేను కాబట్టి చెప్పాను అన్నాడు. ఇంకా ఎన్నో యజ్ఞాలు చేశాను, ఎన్నో పుణ్యాలు చేశాను, ఎన్నో సత్యాలు పలికాను. అసలు నా అంత గొప్పవాడు లేడు అన్నాడు. వెంటనే ఇంద్రుడు ! ఓరి మూడుడా! ఆత్మ స్తుతి పరనింద రెండు పనికి రావు. తనని తాను గొప్పవాడు అని పోగుడుకోవడంతో తను చేసిన పుణ్యం అంతా నశిస్తుంది. ఇతరులని నిందించడం వల్ల మిగిలినది పోతుంది. నువ్వు ఆత్మస్తుతి చేసుకోవడం వల్ల నువ్వు ఇంతకాలం స్వర్గంలో ఉండటానికి సంపాదించుకున్న శక్తి నశించిపోయింది. పో అని భూలోకాని తోసేశాడు. దాంతో భయపడిన యయాతి మళ్లి భూలోకానికి నేను పోలేను. నన్ను మన్నించి ఇక్కడే నక్షత్ర మండలంలో ఉండనివ్వు అన్నాడు. సరే అని జాలిపడి మళ్లి భూలోకానికి ఎందుకులే! నానాయాతనలు పడాలి. నక్షత్ర మండలంలో ఉండు అన్నాడు. (ఎప్పుడైనా ఒక మంచి పని చేసినప్పుడు అది నేనే చేశాను అని ఆత్మస్తుతి చేసుకోకూడదు. నువ్వు చేసిన మంచి ఎదుటివాడు పొగడాలి. అప్పుడు కూడా ఇదంతా పరమాత్మా సంకల్పం అనుకోవాలి.) నక్షత్ర మండలంలో తానుకూడా ఒక నక్షత్రం లాగా మెరుస్తూ ఉండిపోయాడు. కొన్నాళ్ళకి అక్కడకి(యయాతి ఉన్నచోటు) అష్టకులు(8) అనే కొందరు మునులు వచ్చారు. మహారాజ ఎవరు నువ్వు ఇక్కడ వుంటున్నావ్ అంటే దీర్గంగా శ్వాస వదులుతూ దీనంగా!నేను చంద్రవంశంలో జన్మించిన యయాతిని మహారాజుని. అనవసరంగా ఇంద్రుడి దగ్గర ఆత్మస్తుతి చేసుకున్నాను. దాంతో నా పుణ్యం నశించింది. ఇక్కడికి వచ్చి పడ్డాను అన్నాడు. ఆత్మస్తుతి వల్ల బ్రష్టుడిని అయ్యాను. అనగానే ఆ అష్టకులు! మహారాజా నువ్వేమి భాధపడకు. మేము మంచి ధర్మములు తెలుసుకోవాలని వచ్చాము. ఏది ధర్మం ఏది అధర్మం అని అడిగారు. అప్పుడు యయాతి..
పెద్దలు, వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలూ, ఇవి ఇలా చేయండి అని చెప్పాయి. వాటిని శాస్త్రములు అన్నారు. వీటిలో పూజ ఎలా చేయాలి? దానాలు ఎలా చేయాలి? ఎలా నడచుకోవాలి? ఇలా ఇవన్ని చెప్పాయి. వీటిని అనుసరించడమే ధర్మం. దేశ, కాల, మాన పరిస్థితులని బట్టి ఇతరుల రక్షణని దృష్టిలో పెట్టుకుని పలికేది సత్యం. ఒక్కొక్క సారి సత్యం కూడా ప్రమాదమౌతుంది. పరిస్థితిని అంచనా వేసి అసత్యం చెప్పిన తప్పులేదు. (ఒక ఉగ్రవాది వస్తున్నాడు. అది చూసి జనం భయపడి ఒక చోట దాక్కున్నారు అనుకుందాం. నీ దగ్గరికి వచ్చి ఇప్పటివరకు ఉన్న జనం ఎక్కడికి పోయారు అంటే నేను నిజమే చెప్తాను అని ఆ లోపల దాక్కున్నారు అంటే మొత్తాన్ని కాల్చేసి పోతాడు. అంతమంది ప్రాణం పోవడానికి కారణం నువ్వు చెప్పిన సత్యవాక్కు. అది సత్యం కాదు పాపం. లేదండి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అని అబద్దం చెప్తే అది సత్యం అవుతుంది. ఇలా సందర్భాన్ని బట్టి క్షేమాన్ని ఆశించి చెప్పే అబద్దం సత్యఅతిశయం(ఏంటో గొప్పది అయిన సత్యం. సత్యం అంటే మాములుగా చెప్పే నిజం. దీనికంటే కూడా అత్యంత గొప్పది సత్యఅతిశయం) కంటే గొప్పది. మహానుభావులకి దానం చేయాలి. జ్ఞానులని రక్షించాలి. పండితులకి వారి పాండిత్యాన్ని గ్రహించిసత్కారం చెయ్యాలి. తనదగ్గర పనిచేసే వారికి రక్షణ ఇవ్వాలి. పోషణా భారం వహించాలి. అనవసర ప్రాణి హింస పనికిరాదు. నమ్మకున్న భార్యని విడిచిపెట్టరాదు, నమ్మినవారికి ద్రోహం తలపెట్టరాదు. తాగుడు, జూదం లాంటి వ్యసనాలు పనికిరావు. ఇవన్ని ధర్మములు. అనగానే! నువ్వు ధర్మమూర్తివి. ధర్మాత్ముడిని అని పోగుడుకోవడం వల్ల నశించావు కాని నిజంగా ధర్మాలు అన్ని తెలిసిన వాడివి. మేము నీ కూతురి బిడ్డలం. నీకు యదువు, తుర్వసుడుతో పాటు ఒక కూతురు కూడా పుట్టింది జ్ఞాపకమున్నదా? అంటే దేవయానికి నాకు ఒక కూతురు జన్మించింది. 60000 సంవత్సరాల పాటు కమోపభోగాల్లో పడి నా కూతురిని మర్చిపోయాను అన్నాడు. ఆ ఆకూతురి బిడ్డలమే మేము. ఆ కుమార్తెని పరమపవిత్రమైన మునీశ్వరుడు వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన 8మంది సంతానమే మేము. మమ్మల్ని అష్టకులు అని పిలుస్తారు. మేము మా తపశ్శక్తితో ఈ లోకాల్లో తిరుగాడుతున్నాము. ఒకనాడు ఆకాశవాణి మీ మాతామహుడు, మీ తాతగారు బ్రష్టుడై నక్షత్ర మండలంలో వ్రేలాడుతున్నాడు. రక్షించండి అని చెప్పింది. ఎలా రక్షించాలో చెప్పింది. నీ ద్వారా ధర్మాన్ని తెలుసుకుంటే, నీ ధర్మ శక్తిని పరిశీలిస్తే, నీకు శాస్త్ర పాండిత్యం ఉందో లేదో పరీక్షిస్తే, ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే తిరిగి నువ్వు పుణ్యం సంపాదిస్తాడు, అప్పుడు నిన్ను స్వర్గానికి పంపమని ఆకాశవాణి చెప్పింది. నువ్వు నెగ్గావు. ధర్మశాస్త్రాన్ని తు. చా. తప్పకుండా చెప్పావ్! మేము మీ పౌహిత్రులం. అని తమ శక్తితో తాతగారిని స్వర్గానికి పంపారు. వంశంలో ద్రౌహిత్రుడు(కూతురి కొడుకు) ఉంటే అతడు మంచివాడు అయితే వాడు ఒక్క శ్రార్ధం పెట్టినా? ధర్మశాస్త్రం చెప్పింది పాటించినా! కొడుకులు వల్ల లేని స్వర్గం వస్తుంది. ఆత్మస్తుతి వల్ల కోల్పోయిన స్వర్గం కూతురి కొడుకుల వల్ల సంపాదించుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారు.. దీనితో తృతీయ ఆశ్వాసం పూర్తి అయింది.

2 comments:
very nice
post it fast dude