ఆదిపర్వం: నాల్గవ అశ్వాసం: పోస్ట్ - 32

దుష్యంతుని చరిత్ర

దుష్యంతుడు శకుంతల వివాహం జరిగింది. కొంత కాలం క్రీడించాక ఆమె గర్భవతి అయ్యింది. రాజుగారు! సరే మరి నేను రాజ్యానికి వెళ్లివస్తాను. రాజ్య సంరక్షణం చూసుకోవాలి కదా! నిన్ను ఇలా గర్భవతిగా ఒంటరిగా తీసుకెళితే ఎలా? అందుకే సపరివార సమేతంగా, మంచి అట్టహాసంగా, వైభవోపేతంగా, కన్నులపండువగా తీసుకేళతాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఎప్పుడు ఈయన రధం పంపించి నన్ను తీసుకెళతాడు అని ఎదురుచూస్తుంది. ఇంకోపక్కన యజ్ఞం కోసం కణ్వముని వెళ్ళి 6మాసములు అయ్యింది. తండ్రికి తెలియకుండా వివాహం చేసుకున్నా యవ్వన మదంలో! ఈ విషయం తెలిస్తే అపార్ధం చేసుకుంటాడేమో అనే సందేహం. అలా ఆలోచిస్తుండగా అదే సమయానికి కణ్వుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని చాల మంచి పని చేశావమ్మ. దివ్యదృష్టితో చూసి చెప్తున్నాను. నీకడుపున ఈ భూమండలాన్ని సర్వంసహా ఏలగల ఒక ఉత్తముడు ఉద్భవిస్తాడు. నువ్వు అధర్మం చేయలేదు. గాంధర్వం అనే శాస్త్ర ప్రకారం వివాహం చేసుకున్నావు. కాబట్టి భయపడకు అన్నాడు. తండ్రి గారి అనుమతి రాగానే శకుంతల కూడా సంతోషించింది. కొన్నాళ్ళు గడచేసరికి గర్భవతి అయిన శకుంతలకి ఒక కుమారుడు జన్మించాడు. ఈయన పుట్టినప్పుడు భూమి పులకించినదట. భావి భారత సామ్బ్రాట్ వచ్చినట్టు పువ్వులు వర్షంగా కురిసాయి. ప్రక్రుతి పరవసించినది. స్వచ్చంగా సముద్రాలూ పొంగాయి. గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. ఈ కుర్రాడు మంచి బలంగా పుట్టాడు. చిన్నప్పటి నుండి ముని కుమారులతో ఆడుకునేవాడు. మునికుమారులు లేగ దూడలతో ఆడుకుంటుంటే, ఇతడు సింహం జూలు పట్టుకుని ఆడుకునేవాడు. జూలు పీక్కోచ్చేవాడు. అంతటి ధైర్యం గలవాడు. సింహం పిల్లలు పాలు తాగుతుంటే వీడేల్లి ఆ సింహం జూలు పట్టుకులాగి, పిల్లల్ని ఈడ్చుకోచ్చెవాడు. ఆశ్రమంలో ఎగుడు దిగుడుగా ఉన్న నేలని సమం చేయడానికి పిల్లలందరూ చిన్న చిన్న రాళ్ళు మోస్తే వీడు మాత్రం పెద్ద పెద్ద పాషాణాలు మోసేవాడు. అంతటి బలమైన వాడు. ఇలా సింహాలని కూడా పడగోట్టగలిగే బలమున్న సింహబలుడిని చూసి సింహదమనుడు అన్నారు. కొన్నాళ్ళు గడచింది. కుర్రాడు పెరుగుతున్నాడు. ఇంకా ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదు. వీడికి దుష్యంతుడు మాట ఇచ్చినట్టు యువరాజు పట్టాభిషేకం అవ్వాలి అని శకుంతలతో! అమ్మాయి నిన్ను నీ భర్త దగ్గరికి పంపుతున్నాను అని కొంతమంది శిష్యుల్ని ఇచ్చి వెంట పంపాడు. (పూర్వం కూతురుని మెట్టినింటికి పంపేటప్పుడు అప్పగింతలు అని ఉండేవి. కూతురిని పంపిస్తూ ఎడ్చేసేవారు. ఇంతకాలం ఏంతో ప్రేమగా పెంచిన కూతురు అని. కూతురంటే అంత ప్రేమ, మమకారం ఉండేవి. మెట్టినింటికి వెళితే ఎప్పుడు వస్తుందో, అసలు పంపుతారో లేదో, భర్త ప్రేమగా చూసుకుంటాడో లేదో, అత్తగారు కొడతారేమో అని చాల జాగ్రత్తలు చెప్పి పంపించే వారు. ప్రస్తుత కాలంలో తల్లితండ్రులు ఏడవడం ఏమో కాని భార్య భర్తలకి ఒకరంటే ఒకరికి పడక వీళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. ఎప్పుడు విడిపోతారో తెలియక వీరి తల్లితండ్రులు ఏడుస్తున్నారు. అలా మారిపోయింది కాలం.). అలా వెళ్ళిపోతున్న కుమార్తెని చూసి! అయ్యో ఇన్నాళ్ళు నా కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాను. అడవిలో ఉండి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఋషినైన నేను కేవలం పెంపుడు కుమార్తెని పంపుతుంటేనే కన్నీరు పెట్టుకుని గొంతు అవరుద్దం అయిపోతుంది. కన్నీరు వచ్చేస్తుంది. నిజంగా కన్న తల్లితండ్రులు కూతురిని కాపురానికి పంపితే వారు ఎంత భాధపడతారో? అనుకున్నాడు.
    శకుంతల దుష్యంతుడి సభామందిరంలో ప్రవేశించింది. సింహాసనంలో దర్జాగా కుర్చుని ఉన్నాడు. దుష్యంతుడు శకుంతలని ఎవరో వచ్చినట్టు చూసి పట్టించుకోలేదు. ఎవరో వచ్చారు అనుకున్నట్టుగా కూర్చున్నాడు. అది గ్రహించి శకుంతల గుండె గుభేలు మంది. అదేమిటి నన్ను ఎరుగనట్టు చూస్తున్నాడు. నటిస్తున్నాడా? లేక చాలాకాలం అయ్యింది కదా అని మర్చిపోయాడా? (అసలు గుర్తులేకపోతే గుర్తుచేయవచ్చు. గుర్తుంటే ఎవరూ చెప్పనవసరంలేదు. గుర్తువుండి లేనట్టు నటించేవారికి తెలుపడం బ్రహ్మ వశంకూడా కాదు. అయినా ఇంతదూరం వచ్చిన తరువాత సంకోచం దేనికి అనుకుని మహారాజా! మీకు గుర్తున్నదా? కణ్వ ముని ఆశ్రమానికి వేట అనే మిషతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు. 
Next
Previous
Click here for Comments

8 comments:

avatar

plz post it

avatar

nice blog.very interesting to read all these posts

avatar

nice blog..interesting to read

avatar

nice blog..interesting to read

avatar

nice blog..interesting to know

avatar

nice blog..very interesting to read